తమిళ్ స్టార్ హీరో కి నో చెప్పిన శ్రీలీలా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు ( Sreeleela ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా( Dhamaka movie ) సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీయార్ మహేష్ బాబు పక్కన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

 Sreeleela Said No To Tamil Star Hero Details, Sreeleela,telugu Cinema News,movie-TeluguStop.com

అయితే శ్రీలీలకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి.కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ కు జోడీగా నటించే అవకాశం రాగా శ్రీలీల నో చెప్పారని తెలుస్తోంది.విశాల్ సినిమాను శ్రీలీల రిజెక్ట్( Srileela rejected Vishal’s movie ) చేసినట్టు ప్రచారం జరుగుతుండగా ఈ కామెంట్లపై శ్రీలీల ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది…

Telugu Dhamaka, Koratala Shiva, Ravi Teja, Sreeleela, Telugu-Movie

ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు డేట్లు కేటాయించలేని పరిస్థితిలో శ్రీలీల ఉన్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆదివారం సెలవు దినంగా ఉంటుంది.అయితే శ్రీలీల మాత్రం ఆదివారం రోజున కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది.శ్రీలీల రేంజ్ ను తర్వాత సినిమాలు పెంచుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల పారితోషికం కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది…

 Sreeleela Said No To Tamil Star Hero Details, Sreeleela,telugu Cinema News,movie-TeluguStop.com
Telugu Dhamaka, Koratala Shiva, Ravi Teja, Sreeleela, Telugu-Movie

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.శ్రీలీల రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో కూడా సత్తా చాటే అవకాశం ఉంటుంది.శ్రీలీల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది…

కథ నచ్చితే సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా శ్రీలీల ఓకే చెబుతున్నారు.శ్రీలీలకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

శ్రీలీలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube