మెగా ఫ్యామిలీలో నాగబాబు కొడుకు గా ఇండస్ట్రీ కి వచ్చిన వరుణ్ తేజ్( Varun Tej ) చాలా తక్కువ టైం లోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి ఇక ఆయన మిస్టర్,అంతరిక్షం సినిమాల్లో లావణ్య త్రిపాఠి తో( Lavanya Tripathi ) నటించి స్క్రీన్ మీద వీళ్ళ జోడీ బాగుంది.వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ ఔట్ అవుతుంది అనే పేరు ను సంపాదించుకున్నారు.
అయితే ఆ సినిమాలు చేస్తున్న టైం లోనే వీళ్ళ మధ్య ప్రేమ కూడా చిగురించింది ఇక రెండు ఫ్యామిలీ లని ఒప్పించి మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం ( Engagement ) కూడా చేసుకున్నారు…
అయితే రీసెంట్ గా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వరుణ్ తేజ్ చాలా సైలెంట్ గా తన ప్రేమ ప్రయాణాన్ని ఇన్ని రోజులు కొనసాగించారని చెప్పాలి.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ నిశ్చితార్థపు తేదీని ప్రకటించారు…

మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి కేవలం నటిగా మాత్రమే మనకు తెలుసు.అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈమె వరుణ్ తేజ్ తో కూడా రెండు సినిమాలు చేశారు…ఇక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరగబోతుందని తెలియడంతో చాలామంది అసలు లావణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించారు ఈమె తండ్రి హైకోర్టు న్యాయమూర్తి తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.ఇక ఈమెకు ఒక చెల్లి,తమ్ముడు కూడా ఉన్నారట.చదువుపై ఏ మాత్రం ఆసక్తి లేనటువంటి ఈమె తనకు సినిమాలపై ఆసక్తి ఉందని

సినిమా రంగం వైపు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి డిగ్రీ పూర్తి చేసే వరకు ఎటువైపు వెళ్లడానికి వీలు లేదని చెప్పడంతో ముంబైలో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారట.ఇలా డిగ్రీ పూర్తి అయినటువంటి ఈమె మోడలింగ్ వైపు అడుగులు వేశారు.ఇలా మిస్ ఉత్తరాఖండ్ టైటిల్( Miss Uttarakhand ) గెల్చుకున్నటువంటి ఈమె అనంతరం అందాల రాక్షసి సినిమా ద్వారా అవకాశాలు అందుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు…








