నితిన్ తో అడ్వెంచరస్ ఫన్ చేయిస్తున్న వెంకీ.. ఈసారి హిట్ ఖాయమే!

యూత్ స్టార్ నితిన్( Youth star Nitin ) హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.ఈయన భీష్మ( Bhishma movie ) తర్వాత ఆ రేంజ్ హిట్ కాదు కదా మినిమమ్ హిట్ కూడా అందుకోలేక పోయాడు.

 Rashmika Mandanna Nithiin Film With Venky Kudumula Details, #vnrtrio, Venky Kud-TeluguStop.com

మధ్యలో మూడు నాలుగు సినిమాలతో వచ్చిన ఎలాంటి లాభం లేకుండా పోయింది.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

నితిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా భీష్మ సినిమా చేసారు.మరి ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ కుడుముల( Director Venky Kudumula ) డైరెక్ట్ చేయగా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఇప్పుడు ఈ ముగ్గురు కాంబోలోనే మరో సినిమా రాబోతుంది.”VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి కూడా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని ప్రేక్షకులు భావించారు.

ఛలో, భీష్మ ట్రాక్ రికార్డ్ తో వెంకీ ఇదే జోనర్ లో మళ్ళీ ట్రై చేస్తాడు అనుకుంటే ఈసారి కాస్త భిన్నంగా ట్రై చేయనున్నట్టు తెలుస్తుంది.ఈసారి వీరి జర్నీ కాస్త భిన్నంగా అడ్వెంచరస్ గా సాగుతుందట.ఫన్ మాత్రమే కాదు అడ్వెంచరస్ కూడా అని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగిపోయాయి.ఫన్ అండ్ అడ్వెంచరస్ కాంబో అంటేనే రేర్ కాంబో.

ఇలాంటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.మరి ఈసారి కూడా వెంకీ – నితిన్ కాంబోలో సినిమా అదిరిపోతోంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ కాంబోను మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేయగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ప్రజెంట్ షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పటికి టార్గెట్ పెట్టుకున్నారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube