విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఎమ్మెల్సీ కారు బీభత్సం సృష్టించింది.అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు బైకును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే కారును ఘటనా స్థలంలోనే వదిలేసి డ్రైవర్, అనుచరులు పరార్ అయ్యారని తెలుస్తోంది.
అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే కారుకు ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి, కారును గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు.







