ఎవరైనా కొద్ది దూరం మాత్రమే నడవగలరు.కొద్దిదూరం నడిచిన తర్వాత అలసట, ఆయాసం లాంటవి వస్తూ ఉంటాయి.
ఇక భగభగలాడే మండుటెండ, భారీ వర్షాలు, వడగాల్పుల సమయంలో నడవాలంటే మరింత కష్టతరంగా ఉంటుంది.ఇక పాదయాత్రలు చేసే రాజకీయ నేతలు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుని నడుస్తూ ఉంటారు.
అయితే ఒక వ్యక్తి ఏకంగా 370 రోజుల పాటు 8600 కిలోమీటర్లు నడిచాడు. 6 దేశాలను( Six Countries ) కవర్ చేశాడు.
కాలి నడకన అంత దూరం నడవడమంటే మాములు విషయం కాదు.కానీ ఈ వ్యక్తి నిరూపించుకున్నాడు.

ఒక వ్యక్తి కేరళ ( Kerala ) నుంచి ముస్లింల పవిత్రస్థలమైన మక్కాకు ( Makkah )నడుచుకుంటూ వెళ్లాడు.సౌదీ అరేబియాలో ఉండే మక్కాకు కేరళ నుంచి నడుచుకుంటూ వెళ్లాడు.కేరళ రాష్ట్రానికి చెందిన సిహబ్ చొత్తూరు( Shihab Chottur ) యూట్యూబర్ గా ఉన్నాడు.కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అతడు గత ఏడాది జూన్ 2న కేరళ నుంచి మాక్కాకు యాత్రను ప్రారంభించాడు.
ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాల గుండా సౌదీ అరేబియాలో ఉన్న మాక్కా ప్రాంతానికి చేరుకున్నాడు.

సౌదీ అరేబియాలో మదీనాలో 21 రోజుల పాటు గడిపాడు.ఆ తర్వాత అక్కడ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాకు వెళ్లి దర్శించుకున్నాడు.కేవలం మదీనా నుంచి 9 రోజుల్లోనే మక్కాకు చేరుకున్నాడు.
అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి తన కలను సాకారం చేసుకున్నాడు.ఇన్ని రోజులు వేరే వేరే దేశాల నుంచి నడవడమంటే చాలా కష్టతరమైన పని అని చెప్పవచ్చు.
కానీ తనకున్న భక్తితో కష్టాన్ని ఎదురించి ఎట్టకేలకు తన యాత్రను పూర్తి చేశాడు.కొంతమందికి భక్తి బాగా ఎక్కువగా ఉంటుంది.
ఆ భక్తితో దేవుడి కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉంటారు.







