నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) పుట్టిన రోజు సందర్భగా అభిమానుల సందడి అంతా ఇంతా కాదు.నిన్నంతా కూడా ఓ రేంజ్ లో అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే.
అభిమానులతో పాటు బాలయ్య కు ఎంతో మంది సెలబ్రెటీలు మరియు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.పెద్ద ఎత్తున అభిమానుల యొక్క శుభాకాంక్షలతో సోషల్ మీడియా లో సందడి వాతావరణం నెలకొంది.
అయితే అభిమానులు ఈసారి బాలయ్య యొక్క రీ రిలీజ్( Re release ) ను ప్లాన్ చేయక పోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు లకు వారి సూపర్ హిట్ సినిమా లు రీ రిలీజ్ అవుతున్నాయి.
కానీ బాలయ్య సినిమా ఏది కూడా లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు.ఆ మధ్య చెన్న కేశవ రెడ్డి సినిమా( Chenna Kesava Reddy movie ) గురించి ప్రధానంగా చర్చ జరిగింది.
కానీ ఈ పుట్టిన రోజుకు మాత్రం ఏ ఒక్క సినిమా ను కూడా విడుదల చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
బాలయ్య సినీ కెరీర్ లో అత్యంత కీలకమైన సినిమా లు చాలానే ఉన్నాయి.అందులో ఏదో ఒక సినిమా ను నిన్న బర్త్ డే( Balakrishna Birthday ) సందర్భంగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఆయన ప్రస్తుతం చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో పాటు బాబీ దర్శకత్వం లో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతున్నారు.
బాలయ్య.అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా భగవంత్ కేసరి సినిమా ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇదే సమయంలో బాబీ దర్శకత్వం లో సినిమా ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.ఇప్పటికే అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.మొత్తానికి బాలయ్య సినిమా రీ రిలీజ్ హడావుడి లేదు కానీ ఇతర అన్ని విధాలుగా హడావుడి పతాక స్థాయి లో ఉంది.