ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీకి టెక్‌ మహీంద్రా సవాల్‌ ఇదే!

ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీపై( Open AI ChatGPT ) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ వ్యవస్థాపకుడు అయినటువంటి ‘శామ్‌ ఆల్ట్‌మన్‌’( Sam Altman ) చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.

 Tech Mahindra Ceo Cp Gurnani Takes Up Open Ai Chatgpt Founder Sam Altman Challen-TeluguStop.com

కాగా శామ్‌ ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యపై భారత్‌ ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ( CP Gurnani ) చాలా తీవ్రంగా స్పందించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.విషయం ఏమంటే, చాట్‌జీపీటీ తరహా టూల్స్‌ను భారత్‌ ఐటీ సంస్థలు అస్సలు రూపొందించలేవని శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రకటించగా ఆ చాలెంజ్‌ని స్వీకరిస్తున్నట్లు మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ ప్రకటించారు.

Telugu Chatgpt, Indian Tech, Ai, Rajan Anandan, Sam Altman, Silicon Valley, Tech

దాదాపు 6 దేశాల పర్యటనలో భాగంగా తాజాగా భారత్‌కు వచ్చిన శామ్‌ ఆల్ట్‌మన్‌. ఢిల్లీలో జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడారు.ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక్కడ చర్చాగోష్టిలో పాల్గొన్న గూగుల్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా వైస్‌ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ… ఇండియాలో స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఉందని, ఈ స్టార్టప్‌ల్లో ఏదైనా చాట్‌జీపీటీ తరహా ఫౌండేషన్‌ మోడల్‌ అభివృద్ధి చేసే అవకాశం వుందా? అని శామ్‌ ఆల్ట్‌మన్‌ను ప్రశ్నించారు.దీనిపై శామ్‌ ఆల్ట్‌మన్‌ రియాక్టవుతూ.సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో భారత్‌ కంపెనీలు పోటీ పడలేవని అభిప్రాయ పడ్డారు.

Telugu Chatgpt, Indian Tech, Ai, Rajan Anandan, Sam Altman, Silicon Valley, Tech

దాంతో ఒక్కసారిగా కూల్ గా వున్న వాతావరణం వాడివేడిగా మారిపోయింది.దీనిపై టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ అయితే చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు.శామ్‌ ఆల్ట్‌మన్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.‘సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో భారత్‌ స్టార్టప్‌లు, టెక్‌ సంస్థలు పోటీ పడటం నిరాశాజనక ఫలితాలనే ఇస్తుందని, సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో పోటీ పడలేవని ఓపెన్‌ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ చేసిన సవాల్‌ను ఒక సంస్థ సీఈఓగా స్వీకరిస్తున్నానని సీపీ గుర్నానీ తెలిపారు.గూగుల్‌ ఇండియా, సౌత్‌ ఈస్ట్‌ ఏసియా వైస్‌ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనందన్‌ సైతం శామ్‌ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యపై రియాక్టయ్యారు.చాట్‌జీపీటీ తరహా టూల్‌ నిర్మించే సత్తా భారత్‌కు లేదని శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నా.

భారత పారిశ్రామికవేత్తలు సొంతంగా ఏఐ చాట్‌బోట్‌ టూల్‌ తయారీకి ప్రయత్నిస్తారని ట్వీట్‌ చేశారు.ఈ క్రమంలో 5000 సంవత్సరాల చరిత్ర గల భారత పారిశ్రామిక రంగాన్ని తక్కువ అంచనా వేయొద్దని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube