పాకిస్తాన్‌లో( Pakistan ) హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.అక్కడి హిందువులు ( Hindus ) చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అక్కడ నివాసం ఉండేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.పాకిస్తాన్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు.
హిందువులతో పాటు సిక్కులు, క్రైస్తవులు కూడా మైనార్టీలుగా ఆ దేశంలో ఉన్నారు.దీంతో అక్కడ మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా హిందువులపై రోజూ దాడులు చేటుచేసుకుంటున్నాయి.
తాజాగా ఒక హిందూ బాలికను బలవంతంగా అపహరించి మతం మార్చారు.
ఆ తర్వాత ముస్లిం వ్యక్తికి ఇచ్చి బాలికకు పెళ్లి జరిపించారు.అయితే ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
దీంతో అక్కడ హిందువుల పరిస్థితి అతి దయనీయంగా మారిపోయింది.పోలీసుల నుంచి కోర్టుల వరకు ఎవరినీ ఆశ్రయించినా హిందువులకు న్యాయమనేదే జరగడం లేదు.

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సులో 14 ఏళ్ల బాలికను కిడ్నాప్( Kidnap ) చేసి ఇస్లాం మతంలోకి మార్చి బలవంతంగా ముస్లిం వ్యక్తితో పెళ్లి చేసినా కోర్టులు నిందితులకు శిక్ష వేయడం లేదు.తాజాగా బాలికను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.దీంతో తన తల్లిదండ్రుల దగ్గరకు తనను పంపించాలని కోర్టును బాలిక వేడుకుంది.కానీ పెళ్లైన వ్యక్తితోనే ఉండాలని కోర్టు తీర్పు వెలువరించింది.బాలిక సోహనా శర్మ కుమారిని జూన్ 2న బెనజీరాబాద్ జిల్లాలో తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు.

బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని బాలిక చెప్పినా కోర్టు వినిపించుకోలేదు.
తదుపరి విచారణను జూన్ 12కు కోర్టు వాయిదా వేసింది.తన కుమార్తె కిడ్నాప్ కు గురైందని బాలిక తండ్రి దిలీప్ కుమార్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.







