సలార్ హక్కుల కోసం భారీ పోటీ.. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పలుకుతుందో?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.మరొక వారంలో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

 Huge Demand For Prabhas' Salaar Theatrical Rights In Telugu States, Salaar Theat-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇక ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా పాన్ ఇండియన్ మూవీ ”సలార్” ( Salaar ).

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.

మరి తాజాగా ఈ సినిమా బిజినెస్ భారీ మొత్తంలో జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్( Adipurush ) భారీ బిజినెస్ జరుపుకుని సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు సలార్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థకు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయట.వీటిలో ఆదిపురుష్ హక్కులను కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఉందట.

అలాగే గీతా ఆర్ట్స్ ( Geeta Arts )వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సలార్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని రూమర్స్ వస్తున్నాయి.మరి చివరకు సలార్ హక్కులను ఎవరు ఎంత మొత్తానికి దక్కించు కుంటారో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube