పవిత్ర స్థలంలో హీరోతో అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్.. బుద్ధి లేదా అంటూ?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమీషా పటేల్( Ameesha Patel ) ఒకరు.పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ లతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు.

 Trolls Against Ameesha Patel About Gurudwara Scene Details Here Goes Viral In-TeluguStop.com

బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు దక్కాయి.అయితే తాజాగా అమీషా పటేల్ చేసిన ఒక పని వివాదాస్పదం అవుతోంది.

కొన్నిరోజుల క్రితం కృతిసనన్( Kritisanan ) చెంపపై ఓం రౌత్( Om Rauth ) ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరో ఘటన జరగడం గమనార్హం.

ప్రస్తుతం గదర్2 ( Gadar 2 )అనే సినిమాలో అమీషా పటేల్ నటిస్తున్నారు.ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాల షూటింగ్ జరిగినట్టు సమాచారం.

ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు సైతం ఉన్నాయి.

Telugu Ameesha Patel, Gadar, Gurudwara, Kritisanan, Mahesh, Pawan Kalyan, Satbir

అయితే ఈ సన్నివేశాల విషయంలో సిక్కు మతస్థులు సీరియస్ అవుతున్నారు.ఈ నటీనటులకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం లేదా అని కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు.గురుద్వారా నిర్వాహకులు ఈ ఘటన విషయంలో సీరియస్ అవుతుండగా చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి చిత్రయూనిట్ అనుమతులు తీసుకుందని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్( Satbir Singh, Secretary Shiv Kanwar Singh ) వెల్లడించారు.

Telugu Ameesha Patel, Gadar, Gurudwara, Kritisanan, Mahesh, Pawan Kalyan, Satbir

నెగిటివ్ కామెంట్ల విషయంలో చిత్రయూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.అమీషా పటేల్ వివరణ ఇవ్వడం లేదా క్షమాపణలు చెబితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube