ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి.మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల భారీ నష్టం జరుగుతూ ఉంటుంది.
చిన్న పని వల్ల ఏం జరగదులే అనుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.చివరికి అదే మనకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
అలాంటి ఒక సంఘటనే ఇది.రెస్టారెంట్‌లో ( Restaurant ) ఒక బాలుడు చేసిన పనికి ఆ రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టం జరిగింది.

జపాన్‌లోని సుషీ రెస్టారెంట్‌కు చెందిన ఒక ఫ్రాంచైజ్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది.ఈ రెస్టారెంట్‌కు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు.అయితే రెస్టారెంట్‌లో ఉన్న సోయా సాస్ బాటిల్ ( Soya Sauce ) మూత తెరిచి నాకాడు.
నాకిన తర్వాత సోయా సాస్ బాటిల్‌ను టేబుల్ మీద పెట్టాడు.అలాగే అక్కడ ఉన్న టీ కప్పులను కూడా నాలుకతో తాకాడు.ఆ తర్వాత నోట్లో వేలు పెట్టుకుని.అదే వేళ్లతో రెస్టారెంట్ లోని ఆహార పదార్ధాలను తాకుతూ వెళ్లాడు.
బాలుడి ఉమ్మి అక్కడ ఉన్న ఆహార పదార్థాలకు అంటుకుంది.అయితే దీనిని రెస్టారెంట్‌లో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో రెస్టారెంట్ సేల్స్ బాగా పడిపోయాయి.బాలుడు ఇలా చేస్తున్నా పట్టించుకోకపోవడంతో అక్కడి ఫుడ్‌పై కస్టమర్లలో అనుమానం పెరిగింది.దీంతో ఆ రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ తీనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.దీంతో ఆ రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టం కలిగింది.బాలుడి చేసిన చిన్న పనికి రెస్టారెంట్ ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
తాజాగా బాలుడిపై రెస్టారెంట్ యజమాన్యం పరువు నష్టం దావా వేసింది.దీంతో బాలుడు చేసిన పని వెలుగులోకి వచ్చింది.







