వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది అధికారి పార్టీ బీఆర్ఎస్( BRS ) డిసైడ్ అయిపోయింది.దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ,బిజెపి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.బిఆర్ఎస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్లడం , కాంగ్రెస్, బిజెపి అగ్రనేతలంతా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వంటి అన్ని వ్యవహారాలను బిఆర్ఎస్ జాగ్రత్తగా పరిశీలిస్తుంది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి నుంచి ఎదురయ్యే పోటీని ముందుగానే అంచనా వేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు పార్టీ, ప్రభుత్వ పనితీరు పైన ప్రజల్లో బీఆర్ ఎస్ పై ఉన్న అభిప్రాయం ఇవన్నీ సర్వేల ద్వారా తెలుసుకుంటూ, దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజా గా అందిన నివేదికల ప్రకారం రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్( Congress ) అని డిసైడ్ అయిపోయింది.అందుకే కాంగ్రెస్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తుంది.
ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ,( KCR ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ నాయకులు అందర్నీ యాక్టివ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఆదరణ పెంచే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.2014 – 18 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఆర్ ఎస్ కు ప్రధాన పోటీ దారుగా ఉంది .119 అసెంబ్లీ నియోజకవర్గల్లో 2014లో 21 స్థానల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
మరో 50 స్థానాల్లో రెండవ స్థానం లో నిలిచారు.అలాగే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 19సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, 68 చోట్ల రెండో స్థానంలో నిలిచారు.2014 ఐదు స్థానాల్లోనూ 2018 లో ఒక్క స్థానంలోనూ బిజెపి గెలిచింది.రెండు ఎన్నికలను బిజెపి 10 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.ఈ లెక్కలన్నీ పరిశీలిస్తున్న కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ మాత్రమే అని ఫిక్స్ అయ్యింది.
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడం తో ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అందుకే కాంగ్రెస్ ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.కాంగ్రెస్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.అదీ కాకుండా కాంగ్రెస్ లో ఈ మధ్యకాలంలో చేరికలు చోటు చేసుకోవడం పై కేసీఆర్ ఆరా తీస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ లో చేరబోతుండడంతో కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.దాని కనుగుణంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాబోయే ఎన్నికల్లో పై చేయి సాధించే విధంగా కేసీఆర్ ముందడుగులు వేస్తున్నారు.