తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )బొయిన్పల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గురువారం రోజు మైసమ్మ తల్లికి జడ్పిటిసి ఉమా కొండయ్య, మహిళలు బోనం నెత్తిన పెట్టుకొని గ్రామంలో ఊరేగింపుగా డప్పు చప్పులతో మైసమ్మ తల్లి కి బొనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలో కి అడుగుపెడుతున్న సందర్భంలో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పిటిసి కత్తెరపాక ఉమ కొండయ్య( Uma Kondaiah ) , తహసిల్దార్ నరేష్( Naresh ) ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, మహిళలు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.







