భారత్, నేపాల్ మధ్య సరిహద్దు సమస్య ఎప్పటినుంచో ఉంది.ఈ సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు.
ఎన్నో ఏళ్లుగా అది అలాగే నానుతూనే ఉంది.ప్రభుత్వాలు అంతగా చర్యలు తీసుకోకపోవడంతో సరిహద్దు సమస్యలు( Border Disputes ) అలాగే ఉండిపోయాయి.
గతంలో నేపాల్ ( Nepal ) తమ దేశ మ్యాప్‌లో భారతదేశానికి( India ) చెందిన ఒక ప్రాంతాన్ని చూపించడం పెద్ద వివాదానికి దారి తీసింది.చైనా ప్రోద్బలంతో( China ) భారత్‌పై కాలు దువ్వేందుకు నేపాల్ ప్రయత్నిస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి.
అప్పటినుంచి సరిహద్దు సమస్య మరింత ముదిరింది.

ఈ క్రమంలో తాజాగా భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యల గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.దీనికి కారణం నేపాల్ ప్రధానమంత్రినే. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల అధికారులు ప్రయత్నాలు చేయాలని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ( Nepal PM Pushpa Kamal Dahal Prachanda ) వ్యాఖ్యానించారు.
ఇటీవల మే 31 నుంచి జూన్ 3వరకు ఇండియాను ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

డిసెంబర్ 2022లో నేపాల్ ప్రధానిగా కమల్ దమల్ ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి భారత్ పర్యటనకు వచ్చారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు సరిహద్దు సమస్యను స్నేహస్పూర్తితో పరిష్కరించుకుంటామని చెప్పారు.ఈ సందర్బంగా ఇరు దేశాలు మ్యాప్‌ను తమ ముందు ఉంచుకుని సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
భారత పర్యటన గురించి నేపాల్ చట్టసభల్లో ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిచ్చారు.అనేక అంశాలపై తాను మోదీతో చర్చించానని, సరిహద్దు అంశంపై కూడా చర్చలు జరిగినట్లు తెలిపారు
.






