నిరాశపరుస్తున్న 'నరసింహ నాయుడు' అడ్వాన్స్ బుకింగ్స్..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పగ బట్టేసారుగా!

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఊర మాస్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘నరసింహ నాయుడు( ‘Narasimha Naidu )’ చిత్రం కచ్చితంగా ఉంటుంది.2001 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ కి మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల సినిమా.ఆంధ్ర , నైజం అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో ఆల్ టైం రికార్డు నంబర్స్ పెట్టిన సినిమా ఇది.ఫుల్ రన్ 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా 95 కి పైగా డైరెక్ట్ సెంటర్స్ లో వంద రోజులు నడిచింది.అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 10 వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.

 Disappointing 'narasimha Naidu' Advance Bookings..junior Ntr Fans Take Revenge!-TeluguStop.com
Telugu Ntr, Simha, Simhadri, Tollywood-Movie

ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ ఆశించిన రేంజ్ లో లేదు.గత ఏడాది నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరో గా నటించిన ‘చెన్న కేశవ రెడ్డి’ సినిమాని రీ రిలీజ్ చేస్తే బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.సుమారుగా కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.ఈ సినిమా తర్వాత విడుదలైన కొంతమంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రీ రిలీజ్ వసూళ్లను అందుకోలేకపోయాయి.

అలాంటిది పుట్టినరోజు నాడు బాలయ్య కెరీర్ లో ఊర మాస్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘నరసింహ నాయుడు’ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఎందుకు ఇంత వీక్ గా ఉన్నాయి అని ట్రేడ్ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు.అందుకు కారణం సోషల్ మీడియా లో తారాస్థాయికి చేరిన జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) మరియు బాలయ్య బాబు ఫ్యాన్ వార్స్ అని అంటున్నారు విశ్లేషకులు.

వీళ్ళ మధ్య సోషల్ మీడియా లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్నాయి.

Telugu Ntr, Simha, Simhadri, Tollywood-Movie

ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హైర్హాజరు అయ్యినప్పటి నుండి ఈ గొడవలు నడుస్తున్నాయి.

ట్విట్టర్ లో అయితే స్పేస్ పెట్టి మరీ ఇరు ఫ్యాన్స్ బేసులు ఇష్టమొచ్చినట్టు తిట్టాయి.బాలయ్య అభిమానులు అయితే ఎన్టీఆర్ తల్లిపై చాలా ఘోరమైన అభియోగాలు వేశారు.

అప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక బాలయ్య సినిమాలను థియేటర్స్ లో చూడబోమని చెప్పుకొచ్చారు.వాళ్ళు అలా చెయ్యడం వల్లే నరసింహ నాయుడు అడ్వాన్స్ బుకింగ్స్ అంత వీక్ గా ఉన్నాయని అంటున్నారు.

అయితే బాలయ్య ఫ్యాన్స్ దీనికి కౌంటర్ గా మొన్న విడుదలైన సింహాద్రి అడ్వాన్స్ బుకింగ్స్ కి దిక్కు లేదు, మీరు ఏంటి మా సినిమాకి టికెట్స్ తెంపేది?, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్న కౌంటర్ బుకింగ్స్ తో మీ సింహాద్రి( Simhadri ) కలెక్షన్స్ ని దాటేస్తాము అంటూ సవాళ్లు విసిరారు.మరి బాలయ్య ఫ్యాన్స్ సింహాద్రి రీ రిలీజ్ కలెక్షన్స్ ని దాటుతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube