తల్లిదండ్రులు లేని బాలికను సంరక్షణగా ఉండాల్సిన బాబాయి కామాంధుడుగా మారి ఆ బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పంజాగుట్ట ( Punjagutta )లోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది.మధురా నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తల్లిదండ్రులు లేని కారణంగా 15 ఏళ్ల బాలికను ఏప్రిల్ నెలలో అమ్మమ్మ తో పాటు బాలికకు చిన్నాన్న వరుస అయ్యే ఓ వ్యక్తి అనాథ ఆశ్రమంలో చేర్పించారు.అయితే ఆ బాలికకు పరీక్షలు ఉండడంతో.
బాలిక చిన్నాన్న అనాథ ఆశ్రమం ( Orphanage )నుండి ఇంటికి తీసుకువెళ్లి అక్కడ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తానని చెప్పాడు.అన్ని తానై చూసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు.
ఎంతవరకు చదువుకోవాలి అనుకుంటే అంతవరకు ఉన్నత చదువులు చదివిస్తానని హామీ కూడా ఇచ్చాడు.
ఈ కామాంధుడి మాటలను నమ్మిన బాలిక అతనితో కలిసి ఇంటికి వెళ్ళింది.ఇంట్లో గదిలోకి తీసుకువెళ్లి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ తర్వాత ఆ బాలికకు ఓ సెల్ ఫోన్ ఇచ్చి తిరిగి ఆశ్రమానికి తీసుకువెళ్లి వదిలాడు.
ఆ బాలిక రహస్యంగా వాడుతున్న సెల్ ఫోన్ ను ఇతర బాలికలు చూసి ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు.నిర్వాహకులు బాలికను ప్రశ్నించగ నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
వెంటనే ఆశ్రమ నిర్వాహకులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు( Police ) బాలిక దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు చిన్నాన్న.తండ్రి లేని ఆ బాలికకు కన్న తండ్రి స్థానంలో ఉండి బాధ్యతలు తీసుకోవలసిన వ్యక్తి ఇలా మానవత్వం మరిచి అఘాయిత్యం చేయడంపై అందరూ విమర్శిస్తున్నారు.ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఒంటరి మహిళలకు చట్టాలపై నమ్మకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.