వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.
అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.
అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.
కాగా.ట్రక్ డ్రైవర్లు, రోడ్డు మీద వెళ్లే ప్రయాణీకులకు దాబాలు విశ్రాంతిని కల్పించడంతో పాటు వేడి వేడి భోజనాలకు, కాసేపు బ్రేక్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్.అయితే దాబా సంస్కృతి భారతదేశానికి కొత్త కాదు.మనదేశంలో 24 గంటలూ అవి తెరిచే వుంటాయి.
అయితే భారతీయుల పుణ్యామా అని ఇప్పుడు అమెరికాలోనూ( America ) దాబాల సంస్కృతి మొదలైంది.యూఎస్‌లోని ప్రధాన హైవేలపై రికార్డు స్థాయిలో పంజాబీ దాబాలు( Punjabi Dhaba ) వెలుస్తూ వుండటంతో ఇప్పుడు అమెరికన్లు కూడా భారతీయ దాబా రుచులను ఆస్వాదిస్తున్నారు.

న్యూస్ నేషన్ కథనం ప్రకారం.అమెరికాలో ట్రక్కింగ్ మార్గాల్లో రికార్డు స్థాయిలో భారతీయ హోటల్స్, దాబాలు పుట్టుకొస్తున్నాయి.అమెరికా ఇప్పటికే భారతీయ ట్రక్ డ్రైవర్లకు నిలయం.గతంలో అక్కడి హైవేలపై ఎన్నో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు వున్నప్పటికీ.మనవారికి ఆ ఆహారం నచ్చేది కాదు.అయితే ఇప్పుడిప్పుడే పరిస్ధితులు మారుతున్నాయి.
దీనిలో భాగంగానే ఇప్పుడు హైవేలపై దాబాలు వెలుస్తున్నాయి.వెస్ట్ ఓక్లహోమా రూట్ 66లోని ట్రక్ స్టాప్ 40, ఎగ్జిట్ 26 వద్ద ఇప్పుడు వందలాంది మంది ట్రక్ డ్రైవర్లు ఓదార్పును పొందుతున్నారు.
ఇక్కడ సాగ్, రాజ్మా, పరాఠా వంటి భారతీయ వంటకాలను వేడి వేడిగా వడ్డిస్తున్నారు.

ఈ దాబా యజమాని అమర్‌సింగ్ ( Amarsingh ) ఈ ప్రదేశాన్ని లిటిల్ పంజాబ్ , లిటిల్ ఇండియా అని పిలుస్తారు.ఇక్కడ మాట్లాడే భాష, ఆహారం, టీవీ ఛానెల్స్ అంతా భారతీయమే.ఇక్కడ దాబా వున్నట్లుగా సైన్ బోర్డ్‌లు లేనప్పటికీ అమర్‌సింగ్ ట్రక్ స్టాప్ అందరికీ సుపరిచితమే.
ఆ మార్గం గుండా వెళ్లే ట్రక్ డ్రైవర్లు( Truck Drivers ) ఖచ్చితంగా అక్కడ ఆగాల్సిందే.మనవాళ్లే కాదు.అమెరికన్ డ్రైవర్లు కూడా దాబాలకు బాగా అలవాటు పడుతున్నారు.







