సోషల్ మీడియాలో జిల్లా కాంగ్రెస్ పేరుతో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొందరు వ్యక్తులు ఖమ్మం డిసిసి పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని ఖమ్మం డిసిసికి దానికి సంబంధం లేదని అందులో వచ్చే వార్తలను ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎవరు ఇలాంటి పోస్టులను నమ్మొద్దని వాటిని వేరే గ్రూపులలో కూడా షేర్ చేయవద్దని,అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ గ్రూప్ లలో అడ్మిన్ కాని,ఇతర సభ్యులు కాని మన పెద్ద నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయరాదనీ,ఆవిధంగా పోస్ట్ లు పెట్టినచో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని,క్రిమినల్ కేసులు కూడ పెడతామని ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పేరుమీద,
డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పేరు కొన్ని whats App గ్రూపులు ఉన్నవి తక్షణమే గ్రూప్ ల పేరు మార్చు కోవాలని,అట్టి గ్రూప్ లలో అదినాయకత్వం పై అనుచిత వ్యాఖ్యలపై గ్రూప్ అడ్మిన్ లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని,క్రిమినల్ కేసులు కూడ పెడతామని పత్రికా ముఖంగా తెలియజేయుచున్నాను అని అన్నారు.కాంగ్రెస్ ఒక కుటుంబమని,ఇక్కడ అందరూ సమానమే అని, పార్టీ ఎదుగుదల, అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కేసులు నమోదు చేయించి చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఇలాంటి అసత్య ఆరోపణలు నమ్మకుండ అందరం కలిసి సమిష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి ప్రత్యేక తెలంగాణ ఏర్పరిచిన సోనియమ్మకు బహుమతి ఇద్దామని పేర్కొన్నారు.







