సీనియర్ నటి సుమలత(Sumalatha) కుమారుడు అభిషేక్ అంబరీష్ (Abhisekh Ambirishan)వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.జూన్ 5వ తేదీ సాయంత్రం బెంగళూరులో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.
అభిషేక్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అవివా (Avivaa)అనే అమ్మాయితో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
వీరి వివాహ వేడుకకు ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.అభిషేక్ అంబరీష్ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ వివాహానికి నటుడు సుదీప్(Sudheep).కిచ్ఛా ఫ్యామిలీతో హాజరయ్యారు.ఇలా సుదీప్ తన భార్య ప్రియా సుదీప్ (Priya Sudheep) కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.తన భార్యతో కలిసి పెళ్లికి హాజరైనటువంటి సుదీప్ నూతన వధూవరులను ఆశీర్వదించడమే కాకుండా అభిషేక కోసం ప్రత్యేకంగా గోల్డ్ చైన్ గిఫ్ట్ గా తీసుకోవచ్చారు.
ఇలా గోల్డ్ చైన్ (Gold Chain) గిఫ్ట్ గా తీసుకొచ్చిన సుదీప్ స్వయంగా అభిషేక్ మెడలో గొలుసులు వేసి వారిని ఆశీర్వదించారు.ఈ విధంగా సుదీప్ అభిషేక్ కోసం గోల్డ్ గిఫ్ట్ తీసుకురావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

సుదీప్ ఈ విధంగా స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చారు అంటే సుదీప్ అభిషేక్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనకు అర్థమవుతుంది.ఈ వివాహ వేడుకకు ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.సుమలత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందడమే కాకుండా తన భర్త అంబరీష్ మరణాంతరం ఈమె సినిమాలకు దూరమై తన భర్త బాటలోనే రాజకీయాల్లోకి(Politics) వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈమె ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా రాజకీయ నాయకులు కూడా ఈమె కుమారుడు వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు.