కొత్త అవకాశాలను అందరిలా సృష్టించుకోవడం రాదు.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్!

ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి ఆదాశర్మ( Adah Sharma ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.

 You Can't Create New Opportunities Like Everyone Else , The Kerala Story, Adah-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఆదాశర్మ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలా ఆదాశర్మ ఈ సినిమా సక్సెస్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆదాశర్మ మాట్లాడుతూ ఇది కేరళ స్టోరీ సినిమాకు వస్తున్నటువంటి ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Telugu Adah Sharma, Kollywood, Kerala Story-Movie

నా కెరియర్ ప్రారంభమైన 15 సంవత్సరాలకు నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని ఆదాశర్మ తెలియజేశారు.నామీద నమ్మకంతో ఈ సినిమాలో అవకాశం తనుకు కల్పించారని అయితే ఈ సినిమా చూసి ఎంతోమంది తనను ప్రశంసిస్తున్నారని తెలియజేశారు.మొదట్లో నా సినిమాలు చూసి నన్ను విమర్శించిన వారు చాలామంది ఉన్నారని ఆదాశర్మ తెలియజేశారు.ఇలాంటి పాత్రలలో ఎందుకు నటిస్తున్నారు అంటూ నన్ను ప్రశ్నించిన వారు కూడా ఉన్నారని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా చూసిన తర్వాత తాను ఎలాంటి పాత్రలలోనైనా చేయగలననే నమ్మకం అందరిలోనూ ఉందని తెలిపారు.

Telugu Adah Sharma, Kollywood, Kerala Story-Movie

నా సినీ కెరియర్ లో ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూశాను అయితే ఇది కేరళ స్టోరీ సినిమా ద్వారా నా కల నిజమైందని ఈమె తెలియజేశారు.నాకు తొలి సినిమా కూడా ఎన్నో ఆశలతో అంచనాలతోనే చేశాను సినిమా కూడా మంచిగా ఆడటమే కాకుండా అవార్డులు కూడా వచ్చాయి కానీ నాకు అనంతరం మంచి అవకాశాలు రాలేదని ఈమె తెలియజేశారు.ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పాత్రలలో నటించాలని నేను అనుకోలేదు నాకు వచ్చిన అవకాశాన్ని అందుకొని ఆ పాత్రకు 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.

నాకు కొత్త అవకాశాలను సృష్టించుకోవడం రాకపోయినా తనకు వచ్చిన అవకాశాలకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆదాశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube