యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) సినిమా మర వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మాణం జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నేడు తిరుపతి లో వైభవంగా జరగబోతోంది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ని ప్రముఖ దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు.
భారీ మొత్తంలో ఆయనకు ముట్టజెప్పి ప్రీ రిలీజ్ వేడుక బాధ్యతలను అప్పగించడం జరిగిందని సమాచారం అందుతోంది.ప్రశాంత్ వర్మ సినిమా మేకింగ్ లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి.
అంతే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ లో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.అందుకే ఆదిపురుష్ చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు అప్పగించినట్లుగా తెలుస్తుంది.ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత భారీగా జరిగినా కూడా అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ అసంతృప్తి మరెవరో కాదు.
యాంకర్ సుమ.( Anchor Suma ) ప్రస్తుతం యాంకర్ సుమ విదేశాల్లో ఉంది.దాంతో ఆమె స్థానం లో ఈ కార్యక్రమానికి యాంకర్ గా మరో లేడీ యాంకర్ అయిన ఝాన్సీ ని( Anchor Jhansi ) తీసుకు రాబోతున్నారు.
సుమ యాంకర్ గా చేస్తే కార్యక్రమం డబల్ సక్సెస్ అవ్వడం ఖాయం.ఆమె సమయస్ఫూర్తి ఆమె వాక్చాతుర్యం కారణంగా కార్యక్రమం సక్సెస్ అవుతుంది.కానీ ఝాన్సీ ని తీసుకు రావడం అనేది ఈవెంట్ విషయం లో పెద్ద తప్పు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
సుమ లేని ఈ సమయంలో తప్పని పరిస్థితి లో యాంకర్ గారి ఝాన్సీ ని తీసుకు రావాల్సి వచ్చింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నేడు సాయంత్రం ఆదిపురుష్ ని అభిమానులకు పరిచయం చేయబోతున్నది ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రాముడి గా ప్రభాస్ నటించిన ఈ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.