బీజేపీ టీడీపీ దోస్తీ.. వద్దే వద్దు !

బీజేపీ టీడీపీ పార్టీల పొత్తు( BJP is an alliance of TDP parties ) కు సంబంధించిన అంశం ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.దీనికి కారణం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu naidu ) అమిత్ షా( Amit Shah ) తో భేటీ కావడమే.

 Does Bjp Not Want Friendship With Tdp Details, Telugu Political Latest News,bjp-TeluguStop.com

ఈ బేటీ రెండు పార్టీల మద్య పొత్తు కోసమే అనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.కాగా మొదటి నుంచి కూడా బీజేపీ దోస్తీ కోసం టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికి బీజేపీ అధిష్టానం మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటూ వచ్చింది.కానీ కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీతో దోస్తీపై పునఃఆలోచనలో పడింది.

Telugu Amit Shah, Chandrababu, Telugu Latest-Politics

టీడీపీతో కలిస్తే అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ బీజేపీకి మేలు జరుగుతుందనే ఆలోచన ఇప్పుడు కాషాయ పెద్దల మదిలో మెదులుతుందట.ఏపీలో టీడీపీతో కలవడానికి జనసేన ( Janasena party )సిద్దంగా ఉంది.కానీ జనసేన ప్రస్తుతం బీజేపీ పొత్తులో ఉంది.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా బీజేపీతో తెగతెంపులు చేసుకోనైనా టీడీపీతో కలిసే ఆలోచనలో జనసేన ఉంది.నిజంగా జనసేన బీజేపీకి దూరమైతే ఆ ప్రభావం బీజేపీపై గట్టిగా పడుతుంది.

అందుకే ప్రస్తుతం టీడీపీతో కలిసే ఆలోచన చేస్తోంది బీజేపీ అధిష్టానం.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి మరి తెలంగాణ సంగతేంటి అనేదే ఇప్పుడు అసలు చర్చ.

Telugu Amit Shah, Chandrababu, Telugu Latest-Politics

తెలంగాణలో బీజేపీ ఎంతో కొంత బలంగా ఉంది.అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది.అందుకోసం టీడీపీతో కలిస్తే మరింత ఓటు శాతం పెరుగుతుందనే ఆలోచన కూడా కమలనాథుల్లో ఉందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.అయితే టీడీపీతో పొత్తుపై టి బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.

టీడీపీతో పొత్తు ఉండబోదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్( BJP chief Bandi Sanjay ) మరోసారి స్పష్టం చేశారు.ఏన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసుందని గతంలోనే స్పష్టం చేసిన ఆయన మరోసారి అదే విషయాన్ని నొక్కి చెప్పారు.

దీంతో ఒకవేళ బీజేపీ టీడీపీ మద్య పొత్తు కుదిరితే.అది ఏపీ వరకే పరిమితం అవుతుందనేది బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.మరి ఆంధ్రలో పొత్తు తెలంగాణలో వద్దు అంటున్న ఈ రెండు పార్టీల మద్య దోస్తీపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube