టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో జయంత్ సి పరాన్జీ ( Jayanth c Paranjee )ఒకరు.వెంకటేష్ అంజలా జవేరి హీరో హీరోయిన్లు నటించిన ప్రేమించుకుందాం రా ( Preminchukundam raa ) సినిమా ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తెలుగులో పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు.ఇక ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాకి దర్శకత్వం వహించారు.
తెలుగులో ఈయనకు ఇదే చివరి సినిమా.అయితే చాలా కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జయంత్ ఫిదా(Fida) సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో సాయి పల్లవి ( Saipallavi ) వరుణ్ తేజ్( Varun Tej ) హీరో హీరోయిన్లుగా నటించిన ఫిదా సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ జయంత్ మాట్లాడుతూ నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది వరుణ్ తేజ్, సాయి పల్లవి కాదని తెలిపారు.శేఖర్ కమ్ముల ఈ సినిమాని మహేష్ బాబు(Mahesh Babu) కోసం రాసారని తెలిపారు.
ఇదే కథను తనకు వినిపించగా తనకు కూడా చాలా బాగా నచ్చిందని తెలిపారు.

ఇక మహేష్ బాబుకి కూడా ఈ సినిమా కథ వినిపించడంతో ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారని తెలిపారు.ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ( Deepika Padukone ) తీసుకోవాలని భావించాము.ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు దీపిక హీరో హీరోయిన్లుగా రాబోయే ఈ సినిమాని తానే నిర్మించాలని భావించాలని జయంత్ తెలిపారు.
కానీ మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో నుంచి ఎలాంటి సినిమా వస్తుందోనని ప్రేక్షకులు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు.అయితే ఈ సినిమా అంచనాలను చేరుకోదేమోనని భావించి ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలన్న ఆలోచన విరమించుకున్నామని తెలిపారు.
అలా ఫిదా సినిమా మహేష్ బాబు నుంచి వరుణ్ సందేశ్ వద్దకు వెళ్లిందని జయంత్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.








