ఒక్క ప్రమాదం: 100 ప్రశ్నలు !

ఒరిస్సాలోని బాలేశ్వర్ లో కోరమండల్ ఎక్స్ప్రెస్( Coromandel Express ) కు జరిగిన రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో మూడవ అతిపెద్ద ప్రమాదంగా రికార్డులకు ఎక్కింది .ఈ దశాబ్దపు అతిపెద్ద ఉత్పాదంగా రికార్డు అయింది .

 Odishha Rail Accident Is The Big Failure Of Railway Department , Coromandel Expr-TeluguStop.com

ఇప్పటివరకు 280 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతుంటే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి.క్షతగాత్రుల సంఖ్య కూడా వెయ్యికి పైగానే ఉన్నట్లు సమాచారం .రైల్వే లను సురక్షిత ప్రయాణ మార్గంగా భావిస్తున్న కోట్లాదిమంది భారతీయులకు ఈ సంఘటన పెద్ద షాక్ ఇచ్చింది ,ఈ సంఘటన రైల్వేల భద్రతపై పెను ప్రశ్నలు తీసుకొచ్చింది .తెల్లవారితే కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే రైల్వేలు ఇకపై ఎంత మాత్రం క్షేమం కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది .

Telugu Central, Irctcpremium, Odishha, Odishha Rail, Railway-Telugu Political Ne

ఈ ఘటనకు ప్రధాన కారణం సిగ్నలింగ్ వ్యవస్థ( Signaling system ) ఫెయిల్ అవ్వడమేనని ప్రాథమిక సమాచారం వస్తున్నప్పటికీ పేరుకుపోయిన అవినీతి, మానవ నిర్లక్ష్యం,, సాంకేతికంగా వెనకబడిపోవడం నాయకుల అవినీతి వంటి ఎన్నో కారణాలు పరోక్షంగా ఈ సంఘటనకు కారణంగా చెప్పవచ్చు కేవలం టికెట్లు రేట్లు పెంచుకొని స్లీపర్ క్లాస్ భోగిలను, జనరల్ బోగీలను తగ్గించుకుంటూ ప్రీమియం తత్కాల్( IRCTC Premium Tatkal ) పేరిట గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయంపై విపరీతంగా దృష్టి పెడుతున్న రైల్వే డిపార్ట్మెంట్ టెక్నాలజీ( Technology ) ఇంప్రూవ్మెంట్ లో ,కానీ మౌలిక సదుపాయాల కల్పనలో గాని సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి./br>

Telugu Central, Irctcpremium, Odishha, Odishha Rail, Railway-Telugu Political Ne

రైల్వేలో రెండు లక్షల 25 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అందులో మెజారిటీ భాగం సేఫ్టీ విభాగం లోనే అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి .అందువల్లే సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మూడు రైళ్లు ఈ ప్రమాదంలో ఇన్వాల్వ్ అవ్వటం టెక్నికల్గా అతిపెద్ద ఫెయిల్యూర్ గానే చూడాలి.

రైల్వేలలో ఆధునికతకు పెద్ద పీట వేసామని గణంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పాటిస్తున్న వాస్తవ ప్రమాణాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ప్రమాదం తేట తెల్లం చేసింది.కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఈ ప్రమాద ఘటనకు కచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి ,అన్నడిమాండ్ లు వినిపిస్తున్నాయి .ఈ ప్రమాద ఘటనను గుణపాఠంగా తీసుకుని అయినా టెక్నికల్ వర్కులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఆపలేం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube