నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే( Balakrishna Birthday ) ఈ నెలలోనే అనే విషయం ఫ్యాన్స్ కు తెలుసు.జూన్ 10న బాలయ్య తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు.
ఈ క్రమంలోనే ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య బర్త్ డే రోజు వచ్చే ట్రీట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు.మరి అందుకే మేకర్స్ కూడా ముందుగానే ట్రీట్స్ ఉన్నట్టు ప్రకటించారు.

బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఈయన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబోలో తన లేటెస్ట్ మూవీ ”NBK108” చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.
బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బాలయ్య ఫుల్ ఫోకస్ తో పని చేస్తున్నాడు.ఈ సినిమాను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ట్రీట్స్ ఉన్నట్టు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు.
బర్త్ డే కానుకగా అదిరే ట్రీట్ లు రెడీగా ఉన్నాయి అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తెలిపారు.”అన్న దిగుతుండు.ఈసారి ఈ బర్త్ డేకి మాస్ మాములుగా ఉండదు అంటూ అప్డేట్ అందించారు.చూడాలి ఈసారి ఎలాంటి అప్డేట్ ఇస్తారో.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.







