సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ముసాయిదాను ప్రకటించింది.డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మార్చే విధంగా అధీకృత నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు వర్తించనుంది.
దీంతో డిజిటల్ పేమెంట్ లావాదేవీలను సురక్షితంగా చేసేందుకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను ఆర్బీఐ సూచించింది.ఈ మేరకు భద్రతా పరంగా రిస్కులు రాకుండా పీఎస్ వో బోర్డు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
డేటా భద్రతకు సంబంధించి సమగ్రమైన డేటా చోరీ నివారణ విధానాన్ని అమలు చేయాలి.కాగా ఈ ముసాయిదాప పరిశ్రమ వర్గాలు ఈనెల 30 లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని స్పష్టం చేసింది.







