సాగు నీటి దినోత్సవాన్ని, ఊరూరా చెరువుల పండగ కార్యక్రమాలపై శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ సమీక్ష!

వేములవాడ :నేడు వేములవాడ ( Vemulawada )నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ( Chennamaneni Ramesh )బాబు తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో జూన్ ,7 సాగు నీటి దినోత్సవాన్ని,జూన్ 8న ఊరూరా చెరువుల పండగ కార్యక్రమా(Oorura Cheruvula Panduga )లపై శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.నియోజకవర్గంలో నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతిని రైతులకు, ప్రజలకు తెలియ చేద్దామని సూచించారు.

 Lawmaker Chennamaneni Ramesh's Review Of Irrigation Water Day And Uroora Pon-TeluguStop.com

తెలంగాణా రాక ముందు వచ్చిన తరువాత జరిగిన అభివృద్ది, మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో పెరిగిన భూ గర్భ జల సంపద, పెరిగిన పంట విస్తీర్ణం, ఉత్పత్తి, మత్స్య సంపద తెలియ చేయాలని సూచించారు.మూల వాగుపై 12 చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటి లభ్యత, 365 రోజులు నిండు కుండలా వున్న గుడి చెరువు ప్రాధాన్యత, యిలా అన్ని రకాల చెరువుల అభివృద్ధిపై రైతులకు, ప్రజలకు తెలియ చేయాలన్నారు.

ఈ సమీక్షలో ఆర్.డీ.వో పవన్ కుమార్, వేములవాడ దేవస్థానం ఈ.వో కృష్ణ ప్రసాద్, ఇరిగేషన్ ఈ.ఈలు సుమతీ దేవి, అమరేందర్ రెడ్డి, సంతు ప్రకాష్, జగన్, దేవస్థాన ఈ.ఈ రాజేశం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube