కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడు గా ఖర్చు చేస్తున్నారు ..జీ.వీ.ఎల్

రాజకీయ లబ్ధి ఆశించకుండా రాష్ట్ర ప్రజలు కోసం రెవెన్యూ లోటు భర్తీ కి ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi )నిధులు మంజూరు చేశారు నరేంద్ర మోడీ కి ప్రత్యేక చొరవతో ఏపికి నిధులు వస్తున్నాయి 10 వేల 461 కోట్లు రూపాయలు రెవెన్యూ గ్రాంట్ గా ఏపికి కేటాయించింది.ఏపి కి కేంద్రం నిధులు ఇస్తుంటే…ఎందుకు ఇస్తున్నారు అని కొందరు అడుగుతున్నారుఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదు నరేంద్ర మోడీ రాజకీయ లబ్ది కోసం పని చెయ్యరు.

 Gvl Narasimha Rao Comments On Ap Govt , Narendra Modi, Polavaram Project ,gvl Na-TeluguStop.com

ప్రజల కోసం పనిచేస్తారు కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడు గా ఖర్చు చేస్తున్నారు.

ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది రాష్ట్రం అప్పులు ఉబీ లో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందిపోలవరం ప్రాజెక్టు( Polavaram project ) పై ప్రధానికి చాలా సానుకూలంగా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ కి అదనంగా 12 వేల 911 కోట్ల రూపాయలు కేటాయించారు పోలవరం 41.15 మీటర్ల వరకు తొలి దశ నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్యం ఇస్తుంది పోలవరం నిర్మాణం కోసం రూ.12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది.దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోంది.తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ.12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది.

త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు.పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుంది.ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది.తొమ్మిదేళ్ల కాలంలో రూ.55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చింది.కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ది మరెనరికీ చేకూర్చలేదు.

ఏపీకి ప్రధాని మోడీ సరికొత్త వరాలు ప్రకటించాలి.రెవెన్యూ డెఫిసిట్ రూ.10 వేల కోట్లు ఇచ్చారు.స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ.10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారు.ఈ రూ.10 వేల కోట్లు ఏపీ ప్రజలకు వరం.రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోంది.రాష్ట్రం లో‌ వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తాం కేంద్ర పధకాలకు జగన్ స్టిక్కర్లను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు మేం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుంది.2016 నుంచి ఇప్పటి వరకు రూ.16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయి.దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించింది.ఈ ఏడాది కూడా రూ.8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించింది.ఈ ఏడాది రూ.2667 కోట్ల మాత్రమే కోత విధించి.సుమారు రూ.5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube