తాజాగా గురువారం హాకీ జూనియర్స్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఒమన్( Oman ) వేదికగా భారత్- పాకిస్తాన్ ల మధ్య జరిగింది.దాయాది దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటే ఎంత ఉత్కంఠ ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఈ ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.ఇక భారత్ మరోసారి సంచలన చరిత్ర సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ను భారత్ చిత్తగా ఓడించి ఇంటికి పంపించింది.డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టులో అంగద్ బీర్ 13వ నిమిషంలో, అరైజీత్ సింగ్ 20వ నిమిషంలో గోల్ చేశారు.
పాకిస్తాన్ జట్టులో అలీ బషారత్ 38వ నిమిషంలో గోల్ చేశాడు.భారత్ 2-1 తేడాతో హాకీ జూనియర్స్ ఆసియా కప్ టైటిల్ ఖాతాలో వేసుకుంది.
భారత్ 2004, 2008, 2015 లలో టోర్నీ గెలిచి, తాజాగా ఈ టోర్నీలో గెలవడంతో నాలుగుసార్లు ఆసియా కప్ టైటిల్ ( Asia Cup )గెలిచిన రికార్డ్ సాధించింది.టోర్నీ మొత్తంలో భారత్ కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకొని, 50 గోల్స్ సాధించింది.సాధారణంగా ఈ హాకీ జూనియర్స్ ఆసియా కప్ ( Hockey Junior Asia Cup )2021లో జరగాల్సి ఉండేది.కానీ కరోనా కారణంగా టోర్నీ రద్దు కావడంతో 2023లో టోర్నీ నిర్వహించారు.
భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగింది.ఈ టోర్నీతో అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన జట్టుగా భారత రికార్డు సృష్టించింది.
గతంలో పాకిస్తాన్ 1988, 1992,1996 లలో మూడుసార్లు టైటిల్ గెలిచింది.ఇక భారత్ కూడా మూడు టైటిల్లు గెలవడంతో ఇరుదేశాలు మూడు టైటిల్ లతో సమానంగా ఉండేవి.కానీ తాజాగా జరిగిన టోర్నీ వల్ల భారత్, పాకిస్తాన్( Pakistan ) ను వెనుకకు నెట్టేసింది.దీంతో భారత్ అత్యధిక టైటిల్లు సాధించిన దేశంగా అవతరించింది.