టీఎస్పీఎస్సీ పేపర్ లీకులో వెలుగులోకి కొత్త విషయాలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే కాకుండా పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్ లీక్ అయిందని సిట్ అధికారులు నిర్ధారించారు.

మరోవైపు ఇదే వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈఈ రమేశ్ లీలలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రశ్నాపత్రాలను లీక్ చేయడానికి ఇన్విజిలేటర్లతో రమేశ్ ఒప్పందం కుదుర్చుకున్నారని, అదేవిధంగా ఏఈఈ, డీఏఓ పరీక్షల కోసం హైటెక్ మాస్ కాపీయింగ్ కు రమేశ్ తెర తీశారని సమాచారం.

ఈ క్రమంలోనే పదకొండు మంది అభ్యర్థులకు చెవిలో స్పీకర్ అమర్చినట్లు గుర్తించారు.పరీక్ష పూర్తయిన తరువాత చెవిలో స్పీకర్ ను తీసేందుకు మ్యాగ్నటిక్ పరికరాన్ని వినియోగించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.

ఈ క్రమంలోనే అభ్యర్థులకు చిప్ తో డివైస్, మైక్రోఫోన్ అమర్చారని తెలుస్తోంది.పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు మలక్ పేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని తెలిపారు.

Advertisement

హైటెక్ కాపీయింగ్ కోసం ఇంటర్ నెట్ లో రమేశ్ అండ్ గ్యాంగ్ వెతికారని అధికారులు చెప్పారు.ఈ నేపథ్యంలో రమేశ్ చరిత్రపై సిట్ అధికారుల బృందం విచారణ చేస్తుంది.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు