అహింస మూవీ రివ్యూ...

దగ్గుబాటి వెంకటేష్ హీరోగా ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరిగా, తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను వెంకీ ఏర్పరచుకున్నారు .

 Director Teja Hero Abhiram Ahimsa Movie Review Details, Ahimsha Movie Review,dir-TeluguStop.com

దగ్గుబాటి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ రానా కూడా నటుడిగా రాణిస్తున్నాడు .వీరిద్దరి బాటలో సాగుతూ .రానా తమ్ముడు అభిరాం( Hero Abhiram ) కూడా నటుడిగా తనని తానూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తన్నాడు .ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి అభిరామ్ తొలి చిత్రంగా అహింస లో( Ahimsa Movie ) నటించారు .ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ ( Director Teja ) దర్శకత్వం వహించారు .దగ్గుబాటి వారసుడు పరిచయం , తేజ దర్శకత్వం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి .మరి ఈ సినిమా వాటిని అందుకునే స్థాయిలో ఉందొ లేదో రివ్యూ లో చూద్దాం…

ముందుగా కధ విషయానికి వస్తే .వ్యవసాయం చేసుకుని జీవించే ఓ రైతు బిడ్డ, ఓ భూస్వామి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా .అమాయకుడుపై అక్రమ కేసులు పెడితే .చివరికి హింసా మార్గాన్ని ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదనేది కధలో ప్రధాన భాగం తేజ గతంలో అమాయకపు హీరో, బలమైన విలన్. ఇదే కాన్సెప్ట్‌తో చిత్రాలని తీశారు .ఇందులోనూ అదే కధని మరింత బలంగా చూపించే ప్రయత్నం చేశారు…

 Director Teja Hero Abhiram Ahimsa Movie Review Details, Ahimsha Movie Review,dir-TeluguStop.com
Telugu Abhiram Ahimsa, Ahimsa, Ahimsa Story, Ahimsha Review, Teja, Abhiram, Geet

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .గాంధీ, బుద్ధుడు కాదు.కృష్ణుడే కరెక్ట్, ధర్మపోరాటం చేస్తా’ అని హీరో డైలాగ్‌ కధకి ప్రధాన బలం .ఇందులో తేజ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది ., తేజా గతంలో తీసిన సినిమాలన్నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి.సినిమాని చాలా డీసెంట్ గా మొదలు పెట్టారు . హీరో క్యారెక్టర్ ని చాలా పాజిటివ్ గ చూపించారు .ఎప్పుడైతే అక్రమ కేసు ని ఎదుర్కొంటారో అప్పుడే కధ కొత్త మలుపు తిరుగుతుంది .ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ప్రేమకథ కూడా ఉంది .అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు .అయితే హీరోగా తొలి చిత్రంలోనే కాస్త యాక్షన్ పార్టీ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది

Telugu Abhiram Ahimsa, Ahimsa, Ahimsa Story, Ahimsha Review, Teja, Abhiram, Geet

హీరోని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం, హీరోని కొందరు క్రిమినల్స్ వెంబడించడంతో క్రైమ్ థ్రిల్లర్‌ . కధనం సాగుతూ అలరిస్తుంది .ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేయడానికి నిరాకరించడంతో అభిరామ్ ని కాపాడటానికి యంగ్ లాయర్ సదా రావడం …అలాగే విలేజ్ లో అభిరామ్ , మరదలు గీతికల అందమైన ప్రేమకథను ఆకట్టుకుంటుంది క్రైమ్ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా కొంతవరకు అలరించేలా ఉంది

Telugu Abhiram Ahimsa, Ahimsa, Ahimsa Story, Ahimsha Review, Teja, Abhiram, Geet

ఇక నటీనటుల విషయానికి వస్తే .అభిరామ్ చాలా షేడ్స్‌తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అద్భుతంగా కనిపించాడు.ఇందులో గీతిక అతని ప్రేయసిగా ఆకట్టుకుంది.

సదా లాయర్‌గా కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించింది .మిగతా నటీనటులు పరిధి మేరకు అలరించారు .ఇక సాంకేతిక విషయాలకి వస్తే .ఆర్‌పి పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ ఉంది.అలాగే ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది .ఇక దర్శకుడు తేజ తనకు అలవాటైన ఫార్ములానే ఇందులోని వాడారు .ప్రతి నాయకుడు హీరోను ఎలా ఇబ్బంది పెట్టాడు.దానిని హీరో ఎలా అధిగమించారు అనేది అయన వే లో ఒకే అనిపించేలా చూపించారు….ఓవరాల్ గా సినిమా ఒకే అనిపిస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube