సంపద పెంచుదాం.సంపద పంచుదాం అనేదే తమ నినాదమని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని పక్క రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవన్న కేసీఆర్ ఎటు చూసినా వరి కోతలే కనిపిస్తున్నాయని తెలిపారు.
పల్లెల్లో జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.మిషన్ భగీరథతో మంచి నీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు.
బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష సాయం చేశామన్నారు.అదేవిధంగా గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని వెల్లడించారు.