సోషల్ మీడియా( Social media )లో ఎప్పటికప్పుడు వేల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉంటాయి.
కారణం వాటిలోని ఏదో ఒక ప్రత్యేకంగా దాగి ఉంటుంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూడవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా ఏనుగులకు( Elephants ) సంబందించిన వీడియో ఒకటి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మరియు ఆశ్చర్య పరుస్తోంది.దానికి కారణం ఏమిటో తెలియాలంటే మీరు ఈ కంటెంట్ చదవాల్సిందే.

సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాక్‌ను( Railway track ) దాటేటప్పుడు చాలా ఏనుగులు గాయపడడం వంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.ఈ నేపథ్యంలో గజరాజుల సంక్షేమానికై లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో ప్రమాదాలను అరికట్టకుండా వుండలేకపోయిన పరిస్థితులు వున్నాయి.ఈ తరుణంలో వీటిని నివారించేందుకు అక్కడి అధికారులు ఓ సరికొత్త ప్రయత్నం చేశారు.

అవును, వివిధ ప్రాంతాల్లో వాటికోసమే ప్రత్యేకంగా క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేయడం సర్వత్రా ప్రశంసనీయం అయింది.ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు ఓ ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
సుశాంత నంద అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.అది జంతు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.







