తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్( Producer Allu Arvind ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అల్లు అరవింద్.
కాగా అల్లు అరవింద్ కుమారులు అయినా అల్లు అర్జున్ అల్లు శిరీష్ లు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అల్లు అరవింద్ డైరెక్ట్ గా తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు ఇతర భాషలో విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.డైరెక్టర్ పరుశురామ్ ( Director Parusuram )ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు అల్లు అరవింద్.తాజాగా విడుదలైన 2018 సినిమా ( 2018 movie )మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ.
తక్కువ సమయంలోనే పేరు, డబ్బు వచ్చేయాలనుకోవడం కాదు.కొత్త వాళ్లను తొక్కేయకూడదు.
వాళ్ల కోసం స్పేస్ క్రియేట్ చేయాలి అని తెలిపారు అల్లు అరవింద్.కాగా నిర్మాత అరవింద్ ఈ కామెంట్స్ దర్శకుడు పరుశురామ్ గురించే చేసినట్లు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటె గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో( Geetha Arts banner ) వరుస సినిమాలు చేశాడు పరుశురామ్.కానీ ఆ తర్వాత ఎందుకో ఆ బ్యానర్‌తో సన్నిహితంగా మెలగడం లేదు.ఇక ఇదే పంక్షన్‌లో దర్శకుడు చందూ మొండేటిని ప్రశంసించారు అల్లు అరవింద్.ఎన్ని పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ తనకు ఇచ్చిన సినిమా కమిట్‌మెంట్‌ను అతను నిలపుకున్నట్లు తెలిపారు.
అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.ఇకపోతే మొన్నటికి మొన్న కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగ హీరో నాగ చైతన్య పరశురాం గురించి మాట్లాడుతూ.
ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.ఆయన నా టైమ్ వేస్ట్ చేశారు.
ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం నా టైమ్ వేస్ట్.మీ టైమ్ వేస్ట్.
వేరే రీజన్ ఏమీ లేదండి.టైమ్ వేస్ట్ అంతే అని నవ్వుతూనే తన కోపాన్ని వ్యక్తపరిచారు చై.