బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
అయితే ఈ స్టార్ హీరోని కలవడం కోసం బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ( Vicky Kaushal ) ఏకంగా డాన్స్ ప్రాక్టీస్ చేసి తనని కలిసానంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితం అబుదాదిలో జరిగిన అవార్డు ఈవెంట్ కు ఈ ఇద్దరు హీరోలు హాజరయ్యారు.

ఈ అవార్డు వేడుకల్లో భాగంగా హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ ఇద్దరూ కలిసి ఏక్ పల్ కా జీనా( Ek Pal Ka Jeena ) పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ నేను తనని కలవడానికి ప్రతిరోజు పిజా సెట్ ( Pizza set )కి వెళ్లేవాడినని తెలిపారు.అప్పట్లో కహో నా ప్యార్ హై సినిమా విడుదల అయింది.నేను హృతిక్ రోషన్ కి వీరాభిమాని .అయితే ఈయన ఈ పాటకు డాన్స్ చేసిన వారిని కలుస్తారని తెలియడంతో నేను మూడు రోజులపాటు ఈ పాటకు డాన్స్ నేర్చుకున్నానని విక్కీ కౌశల్ తెలియజేశారు.

హృతిక్ రోషన్ చాలా మంచి వ్యక్తి ఆయనని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన తన అభిమాన హీరో, తనకు స్ఫూర్తిగా నిలిచారని హృతిక్ రోషన్ పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోని వీడియోని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







