టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అగ్రహీరోలుగా కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు.ఇక వీరి సినిమా విడుదల అయిందంటే చాలు థియేటర్ల వద్ద కోలాహలం కనిపించేది.
ఇప్పటికీ ఒకే సమయంలో ఈ అగ్ర హీరోల సినిమాలు విడుదల అయితే ఇప్పటికీ ఫ్యాన్స్‌కి పూనకాలే.ఒక హీరో సినిమాను మించి మరో హీరో సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటేది.
భారీగా సినిమాలకు వసూళ్లు దక్కేవి.
అయితే ఈ నలుగురి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.
ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఇప్పటికీ పోటీ వాతావరణం ఉంది.ఇక ఈ నలుగురు కలిసి ఒకే సినిమాలో నటించారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.ఆ సినిమా గురించిన ఆసక్తికర విషయం తెలుసుకుందాం.

ఏదైనా తమ అభిమాన హీరో సినిమా విడుదల అయితే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.అందులోనూ ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటిస్తే ఆ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడతారు.ఇక నలుగురు హీరోలు ఒకే చోట కనిపిస్తే చూసే వారికి కళ్లకు పండగే.
ఇది నిజంగానే ఓ సినిమాలో జరిగింది.మెగాస్టార్ చిరంజీవి,( Chiranjeevi ) నట సింహం బాలకృష్ణ,( Balakrishna ) వెంకటేష్,( Venkatesh ) నాగార్జున ( Nagarjuna ) కలిసి ఒకే సినిమాలో కనిపించారు.
వెంకటేష్ హీరోగా త్రిమూర్తులు( Trimurthulu Movie ) అనే సినిమా వచ్చింది.

ఆ సినిమాలోని ఒక పాటలో వెంకటేష్ తో పాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ కనిపించారు.అయితే వీరు మాత్రమే కాకుండా అలనాటి అందమైన హీరోలు, సోగ్గాడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కూడా అందులో కనిపించారు.భానుప్రియ, విజయశాంతి కూడా ఆ పాటలో నటించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఒకే ఫ్రేమ్‌లొ తమ అభిమాన హీరోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.







