పోరాటంపై నాకు స్పష్టత ఉంది: రాహుల్

గత కొన్ని ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై భారత పరువు తీస్తున్నారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మరోసారి ఆ దిశగా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తాను ఊహించలేదని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.

 Rahul Gandhi Senstional Comments From Stanford University , Rahul Gandhi , Con-TeluguStop.com

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ( Stanford University )లో భారతీయ విద్యార్థులు, విద్యా నిపుణులు, మెదవుల తో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.భారతలో ప్రస్తుతం ప్రతిపక్షాలు తీవ్ర సంఘర్షణలో ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా వారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

ఆర్థిక విదానల పరంగా ,ప్రజాస్వామ్య విధానాలపరంగా అధికారపక్షం అన్ని రంగాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యానికి ఊపిరాడనివ్వటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.అక్కడ విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పిన ఆయన అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టారు .

Telugu China, Congress, Narendra Modi, Rahul Gandhi, Russia, Stand-Telugu Politi

చైనా( China ) తో వచ్చే కొన్ని ఏళ్లల్లో సంబంధాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని డేటా షేరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో కూడా ఈ షేరింగ్ ముందుకు వెళితే ఇరుదేశాలకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.పెగా సెస్ వంటి వ్యవస్థలకు తాను భయపడనని తన ఐప్యాడ్ కూడా మోడీ టాప్ చేసి ఉండవచ్చునని ఆయనవాఖ్యనించారు .భారత రాజకీయాలు ఇలానే ఉంటాయి ఈ పోరాటాలపై తనకు స్పష్టత ఉంది .ప్రజల కోసం ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం కోసం ఎలా ముందుకెళ్లలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అవగాహన ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Telugu China, Congress, Narendra Modi, Rahul Gandhi, Russia, Stand-Telugu Politi

ప్రతిపక్షాలకు పెద్దన్న పాత్ర పోషించి అహంకారపూరితమైన అధికార పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు .మోనోపల్లి అన్నది ఏ రంగంలోనూ మంచిది కాదని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న పార్టీలకు మాత్రమే అధికారం చలాయించే అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.రష్యాపై భారత్ తటస్థ వైఖరిని కూడా ఆయన సమర్థించారు.

జాతీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube