బీసీసీఐ ( BCCI )పర్యావరణ పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.చాలామంది పర్యావరణం గురించి పట్టించుకోక ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తున్నారు.
ఏమైనా అంటే పట్టణీకరణ అంటున్నారు.ఇటువంటి పరిస్థితులలో మార్పు రాకపోతే పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అందుకే బీసీసీఐ ఈ ఐపీఎల్ సందర్భంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అందరం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో డాట్ బాల్స్( Dot balls ) స్థానం లో చెట్లను స్క్రీన్ పై చూపించడం చూసాం కదా.ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ మ్యాచ్ లలో ఎన్ని డాడ్ బాల్స్ నమోదు అయ్యాయో లెక్కేసి.ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ప్లే ఆఫ్ లో భాగంగా క్వాలిఫైయర్-1 మ్యాచ్( Qualifier-1 Match ) చెన్నై- గుజరాత్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్లో 84 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి.ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై- లక్నో మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో 96 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి.ఇక క్వాలిఫైయర్-2 మ్యాచ్ గుజరాత్- ముంబై మధ్య జరిగింది.ఈ మ్యాచ్లో 67 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి.
ఇక ఫైనల్ మ్యాచ్ చెన్నై- గుజరాత్ మధ్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ మ్యాచ్ లో 45 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి.
అంటే ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ మ్యాచ్ లలో మొత్తం 292 నమోదు అయ్యాయి.ఒక డాట్ బాల్ కు 500 చెట్లు అనుకుంటే.292 డాట్ బాల్ లకు మొత్తం 1,46,000 మొక్కలు బీసీసీఐ నాటేందుకు శ్రీకారం చుట్టింది.

ఈ డాట్ బాల్స్ అధికంగా వేసిన వారిలో ఆకాష్ మధ్వల్, మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, మతీశా పతిరన లు ఉన్నారు.ప్రస్తుతం బీసీసీఐ చేపట్టిన కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి భారీగా మద్దతు లభిస్తోంది.







