టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి లాంచ్ చేయడమే కాకుండా ఎందరికో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించినటువంటి వారిలో డైరెక్టర్ వివి వినాయక్ ( VV Vinayk ) ఒకరు.ఈయన దర్శకత్వంలో నటించిన ప్రతి ఒక్క హీరో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.
ఇక ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం చేస్తూ అల్లుడు శీను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో తన కుమారుడు అఖిల్( Akhil) ను ఇండస్ట్రీకి లాంచ్ చేయడానికి వివి వినాయక కరెక్ట్ అని భావించిన నాగార్జున ( Nagarjuna ) ఆ బాధ్యతను వినాయక్ చేతిలో పెట్టారు.
ఈ క్రమంలోనే వివి వినాయక్ అఖిల్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొట్టమొదటి చిత్రం అఖిల్(Akhil Movie).

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో ఈ సినిమా విఫలం అయిందని చెప్పాలి.ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిన అఖిల్ నటించిన సినిమాలలో ఇప్పటివరకు తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.అఖిల్ కి మంచి లాంచింగ్ ఇవ్వడంలో వినాయక్ ఫెయిల్ అవ్వలేదని, అఖిల్ కు సక్సెస్ ఇవ్వడంలో మాత్రమే ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది.

ఇలా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది దీంతో ఈయన మరోసారి అఖిలతో సినిమా చేయాలని భావించినట్టు సమాచారం.ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత అందించబోతున్నారని వినాయక్ కేవలం డైరెక్షన్ మాత్రమే చేయబోతున్నారని తెలుస్తుంది.ఎలాగైనా అఖిల్ కిమంచి సక్సెస్ అందించాలన్న ఉద్దేశంతో వినాయక్ మరోసారి తనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం.ఇక ఏజెంట్ ( Agent ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ సొంతం చేసుకుంది.అలాగే వినాయక్ సైతం చత్రపతి ( Chatrapathi ) సినిమాని హిందీలో రీమేక్ చేశారు.
దీంతో ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయిందని చెప్పాలి.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని తెలియడంతో ఈసారైనా వీరిద్దరూ మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.