డైరెక్టర్ తేజ(Teja) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ద్వారా ఈయన దగ్గుబాటి వారసుడు అభిరామ్(Abhiram) ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.ఇలా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి హీరోగా అభిరామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు అయితే ఈ సినిమా ద్వారా నా కన్నా హీరో అభిరామ్ పైన ఎక్కువ ఒత్తిడి ఉందని తేజ తెలియజేశారు.
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చే హీరోలకు పోలికలు ఎదురవుతాయి.ప్రస్తుతం అభిరామ్ ను వెంకటేష్(Venkatesh) రానా(Rana) లతో అసలు పోల్చి చూడకూడదని తేజ తెలిపారు.
అభిరామ్ కు సినీ నేపథ్యముంది కనుక ఈ సినిమా ఒత్తిడి తనపై ఎక్కువగా ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు సురేష్ బాబు(Suresh Babu) గారు లొకేషన్ లోకి వచ్చారు.ఇలా షూటింగ్ లోకేషన్ లోకి సురేష్ బాబు రావడంతో వెంటనే అభిరామ్ నాన్న మీరు ఇక్కడ ఉంటే నేను నటించినని చెప్పి పక్కన కూర్చున్నారు.అభిరామ్ ఇలా అనడంతో సురేష్ బాబు చేసేదేమీ లేక మానిటర్ వెనక కూర్చున్నారని తేజ తెలిపారు.
సురేష్ బాబు గారు షూటింగ్ లొకేషన్లో ఉంటే వెంకటేష్, రానా కూడా నటించడానికి కాస్త వెనకడుగు వేస్తారు అంటూ తేజ సమాధానం చెప్పారు.

ఇక అహింస(Ahimsa) సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక ఫిలాసఫీ సినిమా అని తెలిపారు.అహింసను ఎలా వాడాలో చెప్పాము.ఈ చిత్రంలో ఏకంగా 14 ఫైట్ సీక్వెన్సులు ఉన్నాయి.
వాటిలో 4 యాక్షన్ సన్నివేశాలకు నేనే ఫైట్ మాస్టర్ గా పనిచేశానని ఈ సందర్భంగా తేజ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.ఇక ఈ సినిమా హిట్ అయ్యి మంచి డబ్బులు రాబడితే వెంటనే తాను మరొక సినిమా కూడా చేస్తాను అంటూ సినిమా గురించి హీరో అభిరామ్ గురించి తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







