ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.ఇటీవలే నాలుగు సంవత్సరాల ప్రభుత్వ కాలాన్ని పూర్తి చేసుకున్న వైకాపా( YCP ) మరో సంవత్సరం మాత్రమే మిగిలి ఉండడంతో ఆగమేఘాల మీద పార్టీ మరియు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంది అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక వచ్చే సంవత్సరం వైకాపా తరపున పోటీ చేసే ఎమ్మెల్యేల విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.గత ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందికి మరో సారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) సిద్ధంగా లేరనే చర్చ జరుగుతుంది.
ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం సమయం ఉంది కనుక ఈ లోపు వారు నియోజక వర్గంలో తమ పనితనాన్ని మెరుగు పరుచుకుని స్థానికంగా ఓటర్ల నుండి మంచి పేరు సొంతం చేసుకుంటే తప్పితే వారికి మళ్ళీ అవకాశం ఇచ్చేది లేదు అంటూ పార్టీ అధినాయకత్వం ఖరాకండిగా చెప్పేస్తుందట.ఈ విషయం లో పార్టీ ముఖ్య నేతలకు కూడా మినహాయింపు లేదు అంటూ రాజకీయ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఇంతకు ముందు మంత్రులుగా చేసిన వారిలో కూడా కొందరికి సీటు అనుమానమే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.మొత్తానికి ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా ఏపీ లో ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు తమ పరిస్థితి ఏంటో అంటూ ఇప్పటి నుండే ఆలోచించుకోవడం మొదలు పెట్టారట.కొందరు ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ( TDP ) వైపు కూడా చూస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే ఆ ఎన్నికలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.