మనలో చాలామంది విమాన ప్రయాణం( Flight Journey ) చేయాలని వున్నా చేయడానికి చాలా ఆలోచిస్తారు.ఎందుకంటే టికెట్ ధరలు ఆకాశంలో ఉంటాయి మరి.
అలాంటిది ఉచితంగా విమాన టిక్కెట్లను( Free Flight Tickets ) సొంతం చేసుకోవచ్చంటే ఎవరూరుకుంటారు చెప్పండి అంటారా? ఆగండాగండి… విషయం పూర్తిగా చదవండి.సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా విమానాలకు రైలు ప్రయాణ రేటు కంటే కనీసం 3 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు.అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటి ఉంది.అది… ఉచితంగా విమానంలో పయనించడం.

అవును, కొన్ని విమానయాన సంస్థలు ఆ కంపెనీతో తరచుగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించే విధానంలో రివార్డ్ పాయింట్లను అందిస్తూ ఉంటాయి.ఆ రివార్డ్ పాయింట్లను( Reward Points ) ఆధారంగా చేసుకొని మనం ఫ్లైట్ పయనం చేసుకోవచ్చు.ఆ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసి టిక్కెట్‌ను బుక్ చేసుకోండి ఇక.ఈ రివార్డ్ పాయింట్లను భారతదేశంలో ఎయిర్ మైల్స్( Air Miles ) అని పిలుస్తారు.కొన్ని కంపెనీల్లో కరెన్సీ విలువ కూడా ఇస్తారు.ఉదాహరణకు, స్పైస్‌జెట్( Spice Jet ) ప్రతి రివార్డ్ పాయింట్‌కు INR 50 విలువను అందిస్తుందంటే మీరు నమ్ముతారా?

అంటే మీకు ఇక్కడ రెండు స్పైస్ జెట్ పాయింట్లు ఉంటే ఒక రూపాయి విలువకి సమానం.ఈ రకంగా మీరు 10,000 స్పైస్‌జెట్ రివార్డ్స్ పాయింట్‌లను కలిగి ఉంటే రూ.5 వేల విలువైన విమాన టిక్కెట్లు పొందవచ్చు.దీని కోసం మీకు మరే ఇతర మార్గంలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయబడదు.ఇంతకు ముందు మనం కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలు ఇలాంటి రివార్డ్ పాయింట్‌లు మరియు కూపన్‌లను ఆఫర్ చేయడం చూశాము.
ఈ ఎయిర్ మైల్స్ రివార్డ్ పాయింట్ల బేరానికి వచ్చింది.ఇదొక బిజినెస్ స్ట్రాటజీ గురూ!
.






