అవును, మీరు విన్నది నిజమే. వాట్సాప్( WhatsApp ) దేనినీ వదలడం లేదు.
వినియోగదారులకు అవసరమైన అవసరాలను తీర్చేవరకు నిద్రపోయేట్టు లేదు.భారతదేశంలో చిన్న మొత్తాల పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అంటే ఎంత నమ్మకమో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.
ఒక సర్వే ప్రకారం ఇండియాలోని ఎల్ఐసీ పాలసీ లేని ఇల్లు ఎక్కడ వెతికినా దొరకదు అని తేల్చడం జరిగింది.గ్రామీణులు దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకూ అందరికీ ఎల్ఐసీ పాలసీలు ఉండడం ఇపుడు పరిపాటిగా మారింది.

పెట్టుబడికి నమ్మకమైన రాబడితో పాటు బీమా కవరేజి ఉండడంతో ఎక్కువ మంది ఎల్ఐసీ వైపు ఆకర్షితులు అయ్యారు.అయితే ఎల్ఐసీ సేవలను పొందడానికి మాత్రం సమీప బ్రాంచ్‌లకు వెళ్లి గంటల తరబడి లైన్‌లో నుంచోవాల్సి వస్తుందన్న ఆరోపణలతో పాలసీదారులకు మెరుగైన సేవలను అందించేందుకు తాజాగా ఎల్ఐసీ వాట్సాప్ ద్వారానే 11 రకాల ఎల్ఐసీ సేవలను పొందేందుకు అవకాశం ఇచ్చింది.అవును, పాలసీ హోల్డర్( Policy Holder )లు ఇప్పుడు రుణ అర్హత, పాలసీ స్థితి, రీపేమెంట్ అంచనాలు, బోనస్ వివరాలు, యూనిట్ల స్టేట్‌మెంట్, ప్రీమియం బకాయి తేదీల అప్‌డేట్‌లు, ఎల్ఐసీ సేవలకు లింక్‌లు, రుణ వడ్డీతో సహా 11కి పైగా సేవలకు ప్రత్యక్ష సేవలను వాట్సాప్ ద్వారా ఇప్పుడు పొందవచ్చు.

ఎల్‌ఐసీ పాలసీదారుల కోసం తొలిసారిగా వాట్సాప్ ఈ సేవలను అందించడం విశేషం.ఎల్ఐసీ ( LIC services )పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న వాట్సాప్‌లో ఎల్ఐసీ పాలసీదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయని సమాచారం.హాయ్ అయిన అని టైప్ చేసి 89768 62090కి పంపితే ఎల్ఐసీ పాలసీదారులు ప్రీమియం వివరాలు, యూలిప్ ప్లాన్ స్టేట్‌మెంట్‌ల వంటి వివిధ ప్రయోజనాల కోసం వాట్సాప్ సేవలను ఉపయోగించవచ్చు.







