మన టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో చెయ్యాల్సిన సినిమాని మరో స్టార్ హీరో చెయ్యడం, అవి హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం వంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ తర్వాత కొన్నాళ్ళకు సదరు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ లేదా నిర్మాత ఈ సినిమాని ముందుగా ఆ హీరో తో చేద్దాం అనుకున్నాం అని చెప్పినప్పుడు, ఆ హీరో అభిమాని అయ్యో ఎంత మంచి సినిమాని మిస్ అయ్యామే అని బాధపడుతుంటారు, ఒక ఫ్లాప్ అయిన సినిమాని మిస్ అయ్యుంటే ‘హమ్మయ్య తప్పించుకున్నాం’ అని అనుకుంటారు.
ఇలాంటి సందర్భాలు తరచూ జరుగుతూనే ఉంటాయి, సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ఇది సర్వసాధరణం అయిపోయింది.ఇలా ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు గా ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు.
వీళ్ళు వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే ఫ్యాన్స్ చాలా బాదపడిపోతారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి గుంటూరు కారం( Guntur Kaaram ) అనే టైటిల్ ని ఫిక్స్ చేసి నిన్న ఒక గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చేసారు.ఈ గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మహేష్ ని ఇంత మాస్ లుక్ లో చూసి చాలా కాలం అయిందని , ఇలాంటి టీజర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది.
అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత జూనియర్ ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నాడట.వాస్తవానికి #RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్( Jr ntr ) ఈ సినిమానే చెయ్యాల్సి ఉంది.
స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత, కొన్ని కీలక మార్పులు సూచించాడు ఎన్టీఆర్.త్రివిక్రమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు గానే మార్పులు చేసి తీసుకొచ్చాడు, అయిన కానీ ఎన్టీఆర్ నచ్చకపోవడం తో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.

అదే స్క్రిప్ట్ లో మహేష్ కి తగ్గ్గట్టుగా కొన్ని సీన్స్ అదనంగా రాసుకొని ‘గుంటూరు కారం‘ పేరుతో మన ముందుకి రాబోతునట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో పూజ హెగ్డే మరియు శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.టీజర్ విడుదలకు ముందే అమెరికా రైట్స్ సుమారుగా 4 మిలియన్ డాలర్లకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఇది రీజినల్ చిత్రాలలో ఆల్ టైం రికార్డు బిజినెస్ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతున్న ఈ సినిమా ఇక విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.
డివైడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీల గా కొల్లగొడుతున్న మహేష్ బాబు కి ఒక్కసారి టాక్ వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ తో పాటుగా ట్రేడ్ కూడా ఎదురు చూస్తుంది.







