ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల( NTR 100th Birthday Celebrations ) సందర్భంగా ఆయన గురించి అనేక సంఘటనలు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.ఈ ఆర్టికల్ లో కూడా అలాంటి ఒక అరుదైన సంఘటనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎన్టీఆర్కి భోజనం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.ఆయన అవసరానికి మించి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా అంతే రేంజ్ లో వ్యాయామాలు చేసి బాడీ నీ చాలా ఫిట్ గా ఉంచుకునేవారు.
హీరోగా ఎన్టీఆర్ నటించిన మంచి భోజనం తీసుకునే అలవాటున్న ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు.ఎప్పుడు అయితే రాజకీయాల్లో( NTR Politics )కి రావాలి అనుకున్నారు దానికోసం ఒక ప్రచార యాత్ర చేశారు.

తన కొడుకు హరికృష్ణ( Harikrishna ) నేపథ్యంలో ఒక వ్యాన్ ని ప్రచార రథం గా ఉపయోగించుకొని దానిపై కూర్చొని ప్రతి వూరు తిరిగారు.అయితే ఆయన ప్రచారం చేస్తున్న సమయం లో అభిమానులు ఆయన కోసం తండోప తండాలుగా వచ్చేవారు.అలాగే ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్న ఎన్టీఆర్ కోసం అభిమానులు ఆయన రాక కోసం ఎదురు చూసారట.అంతే కాదు ప్రతి స్టేషన్లో ఆయనకు ఎంతో ఇష్టమైన నేతి పెసరట్టు( Nethi Pesarattu )ను పట్టుకుని ఆ రైలు మొదలుపెట్టిన దగ్గర నుంచి దిగే వరకు అభిమానులు ఎదురు చూడడంతో ప్రతి స్టేషన్ లో ఆగిన ఎన్టీఆర్ అభిమానించిన నేతి పెసరట్టు నువ్వు తింటూ వచ్చారట అలా మొదటి నుంచి చివరి వరకు ప్రతి అభిమాని ఇచ్చిన నేటి పెసరట్టును తిన్నారని అప్పటి ఆయన తోటి రాజకీయ నాయకులు ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారట.

అలా అలా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఏ స్టేషన్లో ఆగినప్పుడల్లా నేతి పెసరట్టు ను ఎంతో ఇష్టంగా తిన్నారట ఎన్టీఆర్.ఈ సంఘటన అప్పటి ప్రజలకు వారి మనసుల్లో గుర్తుండి పోయింది.ఆ తర్వాత కొన్ని నెలల్లో ఆయన విజయం సాధించి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు ఇలా ఎన్టీఆర్ జీవితంలో బయటకు తెలియని ఎన్నో సంఘటనలు ఇంకా ఉన్నాయి.అన్ని పొందిన ఎన్టీఆర్ దారుణమైన రీతిలో ఆ పీఠం నుంచి దిగిపోయారు చివరికి డిప్రెషన్ తో కన్నుమూశారు.