ఈ ఐపీఎల్ ( IPL 2023 )ఎంతో ఆసక్తికరంగా సాగింది.సీనియర్ ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా యువ ఆటగాళ్లు( Young players ) తమ సత్తా ఏంటో చూపించారు.
భవిష్యత్తులో భారత జట్టులో( Indian Team ) చోటు దక్కాలంటే ఐపీఎల్ ఒక మంచి వేదిక.ఈ ఐపీఎల్ లో మెరిసిన యువ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
యశస్వి జైస్వాల్
: రాజస్థాన్ ఫ్రాంచైజీ రూ.4 కోట్లు వేచించి సొంతం చేసుకున్న ప్లేయర్.ఆడిన 14 మ్యాచ్లలో 625 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.ఇక 13 బంతుల్లో అర్థ సెంచరీ చేసి, తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
రింకూ సింగ్
: కోల్ కత్తా ఫ్రాంచైజీ రూ.55 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన 14 మ్యాచ్లలో 474 పరుగులు చేశాడు.
ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.అయితే ఒకే ఒక మ్యాచ్ తో రింకూ సింగ్ పేరు మారు మోగింది.
ఆఖరి ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి జట్టును గెలిపించాడు.

తిలక్ వర్మ
: ముంబై ఫ్రాంచైజీ రూ.1.70 కోట్లు వేచించి సొంతం చేసుకుంది.11 మ్యాచ్లలో 343 పరుగులు చేశాడు.క్వాలిఫైయర్-2 లో గుజరాత్ పై 14 బంతుల్లో 43 పరుగులు చేశాడు.మ్యాచ్ ఓడిన కూడా తిలక్ వర్మ ఇన్నింగ్స్ అద్భుతం.
సాయి సుదర్శన్
: గుజరాత్ ఫ్రాంచైజీ రూ.20 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన 8 మ్యాచులలో 362 పరుగులు చేశాడు.చెన్నై పై 47 బంతుల్లో 96 పరుగులు సాధించాడు.
ఆకాశ్ మధ్వల్
: ముంబై ఫ్రాంచైజీ రూ.20 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన ఎనిమిది మ్యాచ్లలో 14 వికెట్లు తీశాడు.ముంబై జట్టు క్వాలిఫయర్-2 కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
తుషార్ దేశ్ పాండే
: చెన్నై ఫ్రాంచైజీ రూ.20 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన 16 మ్యాచులలో 21 వికెట్లు తీశాడు.
చెన్నై జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

సుయాశ్ శర్మ
: కోల్ కత్తా ఫ్రాంచైజీ రూ.20 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన 11 మ్యాచ్లలో 10 వికెట్లు తీశాడు.కీలక సమయాలలో వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచాడు.
నెహల్ వధేరా
: ముంబై ఫ్రాంచైజీ రూ.20 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన పది మ్యాచ్లలో 241 పరుగులు చేశాడు.డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడి ముంబై గెలుపులలో కీలక పాత్ర పోషించాడు.
మాయాంక్ మార్కండే
: హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.50 లక్షలు వేచించి సొంతం చేసుకుంది.ఆడిన పది మ్యాచ్లలో 12 వికెట్లు తీసి, భువనేశ్వర్ కుమార్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్ గా నిలిచాడు.
యశ్ ఠాకూర్
: లక్నో తరపున రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగి చివరికి రూ.45 లక్షలు ఖాతాలో వేసుకున్నాడు.9 మ్యాచ్లలో 13 వికెట్లు తీశాడు.కీలక సమయాలలో కీలక వికెట్లు తీసి తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.







