టీడీపీకి( TDP ) ఈసారి ఎన్నికలు డూ ఆర్ డై లాంటివనే సంగతి అందరికీ తెలిసిందే.అందుకే ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధినేత చంద్రబాబు.
పక్కా వ్యూహరచనతో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు.ఇప్పటికే లోకేశ్ ( Lokesh )పాదయాత్రతో పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో ఉంటే.
మరోవైపు చంద్రబాబు పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తు తనదైన రీతిలో ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉండడంతో వేసే ప్రతి అడుగు కూడా గెలుపు దిశగా ఉండాలనేదే చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.

అందులో భాగంగానే ఇటీవల మేనిఫెస్టో ( Manifesto )ను ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు చంద్రబాబు.అయితే బాబు ప్రకటించిన మేనిఫెస్టోపై కొందరిలో సానుకూలత వ్యక్తమౌతుంటే.మరికొందరు మాత్రం అనుమానాలను లేవనెత్తుతున్నారు.ముఖ్యంగా మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ ను ఫాలో అయ్యారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.ఎందుకంటే ఇటీవల చంద్రబాబు( Chandrababu ) ప్రకటించిన మేనిఫెస్టోలో చాలా అంశాలు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను పోలి ఉన్నాయి.ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి.
ఇలాంటి హామీలను కర్నాటక ఎన్నికల్లో హైలెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఈ హామీల ప్రకటనతో అక్కడి ప్రజలు గంపగుత్తున కాంగ్రెస్ కు ఒట్లేశారు.దీంతో ఏకంగా 135 స్థానాలలో విజయం సాధించి సంచలనం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ.దాంతో ప్రస్తుతం అదే వ్యూహాన్ని ఏపీలో టీడీపీ అమలు చేయాలని చూస్తోంది.
అందులో భాగంగానే ఉన్నపళంగా మేనిఫెస్టో ప్రకటించడం, ఆ మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను పోలీఉండడం చూస్తే టీడీపీ కాంగ్రెస్ ను గట్టిగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయనికి దారితీసిన పరిణామాలు చాలానే ఉన్నాయి.
కానీ ఏపీలో అలా కాదు ఏపీలో అధికార వైసీపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన కాపీ మేనిఫెస్టో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది కూడా ప్రశ్నార్థకమే.
మొత్తానికి ఏపీ గెలుపు విషయంలో కాంగ్రెస్ ను ఫాలో అవుతున్న బాబు ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.







