యాదాద్రిభువనగిరి జిల్లా: జిల్లాలో త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులైన ఆరుగురిపై మంగళవారం పోలీసులు( police ) కేసు నమోదు చేసి అర్ధరాత్రి నలుగురు రైతులను రిమాండ్ కు తరలించిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
నిన్న కలెక్టరేట్ ( Collectorate )ఎదుట ఆందోళన చేసిన రైతుల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వారికి సహకరించిన గూడూరు నారాయణరెడ్డి( Guduru Narayana Reddy ), తంగళ్ళపల్లి రవికుమార్ ను ఇంకా రిమాండ్ కు తరలించలేదు.కేసు నమోదు చేసిన వారు వీరే…
A1:గడ్డమీద మల్లేష్ A2:పల్లెర్ల యాదగిరి A3:అవిశెట్టి నిఖిల్ A4:మల్లెపోయిన బాలు A5:తంగేళ్లపల్లి రవి కుమార్ A6:గూడూరు నారాయణరెడ్డివీరిపై పెట్టిన సెక్షన్స్… 65:147,148,341,436, 427,353,120B R/W 149 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.







