మావెరిక్ డైరెక్టర్ శంకర్( Shankar ) సినిమాలంటే వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంటాయి అనే విషయం తెలిసిందే.ఒక్క తమిళ్ లోనే సినిమాలు చేసి వరల్డ్ వైడ్( World wide ) గా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రతీ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో సాలిడ్ ప్రమోషన్స్ తో హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించడం శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య.అయితే రోబో తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోలేక పోయాడు.

ఇక ప్రజెంట్ శంకర్ రెండు సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) తో ‘గేమ్ చేంజర్’( Game chander ) చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2( Indian 2 ) సినిమా చేస్తున్నాడు.పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే శంకర్ రామ్ చరణ్, కమల్ సినిమాలకు ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు.ఒక షెడ్యూల్ ఇక్కడ మరో షెడ్యూల్ అక్కడ ఇలా గాప్ లేకుండా కష్టపడుతున్నాడు.
అయితే సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు కానీ రిలీజ్ విషయం లోనే ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ సినిమా వచ్చి ఏడాది అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఈయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.సినిమా చివరి స్టేజ్ కు వచ్చిన కూడా ఇంత వరకు ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు.అయితే ఇండియన్ 2 సినిమాను ముందుగా రిలీజ్ చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట.
అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఇండియన్ 2 రిలీజ్ అయితే కానీ రిలీజ్ అయ్యేందుకు ఛాన్స్ లేదు.ఇది డిసెంబర్ లో రిలీజ్ అయితే రామ్ చరణ్ మూవీ సమ్మర్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
చూడాలి ఎప్పటికి ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వస్తుందో.







