Vithika : అలా తయారై చెడిపోతున్నావంటూ వితికాపై నెగిటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బ్యూటీ?

అలా తయారై చెడిపోతున్నావంటూ వితికాపై( Vithika ) నెగిటివ్ కామెంట్స్.దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బ్యూటీ?సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతున్నారు.ముఖ్యంగా తము వేసుకునే డ్రెస్సింగ్ విషయంలో మాత్రం బాగా దిగజారిపోతున్నారు.ఒక సినిమా పరంగా వేయాల్సిన దుస్తువులు వేయాల్సినంత వరకు వేస్తే పరవాలేదు కానీ.ఆ దుస్తువులు బయట పబ్లిక్ ప్లేస్ లో వేస్తే మాత్రం కచ్చితంగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కోవాల్సిందే.అలా శరీరం కనిపించే విధంగా దుస్తులు ధరిస్తే ఎవరైనా సరే జనాలు ఏకిపారేస్తూ ఉంటారు.

 Negative Comments On Vithika Saying That She Is Getting Spoiled-TeluguStop.com

ఇప్పటికే ఇటువంటివి నెగిటివ్ కామెంట్లు చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొన్నారు.అయితే తాజాగా వితికా షేరు కూడా డ్రెస్సింగ్ విధానంతో బాగా నెగిటివ్ కామెంట్స్ ఎదురుకుంటుంది.

దీంతో ఈ బ్యూటీ దెబ్బకు వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి నోరు మూయించింది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఇంత పేరు తెచ్చుకుంది వితికా షేరు.ఇక ఈమె హీరో వరుణ్ సందేశ్ ( Varun Sandesh )భార్య.వితికా అప్పట్లో తెలుగులో పలు సినిమాలలో చేయగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఏదో చిన్ననటిగా మాత్రమే పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా ప్రేక్షకులకు కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు.ఎప్పుడైతే బిగ్ బాస్ 3( Bigg Boss 3 ) లో తన భర్తతో పాటు తను కూడా పాల్గొందో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారి ప్రతిరోజు తన ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న వితికా ఈ మధ్య బాగా వర్కౌట్ చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.

తను జిమ్ లో ఉన్న ఫోటోలను, వీడియో క్లిప్ లను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఈమెకు నిహారిక కొణిదెల( Niharika Konidela ) కూడా బాగా పరిచయం కావడంతో ఆమెతో కలిసి ఈమె కూడా బాగా సందడి చేస్తుంది.

ఇక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారగా ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం, జిమ్ములో ఒకేలా డ్రెస్సులు వేసుకోవటం ఇలా చాలా రకాలుగా బాగా క్లోజ్ అవుతున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా వితికా, నిహారిక తో పాటు మరి కొంతమంది అమ్మాయిలతో కలిసి వెకేషన్ కి వెళ్ళగా అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తున్నారు.అయితే రీసెంట్ గా తను వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఒక వీడియోను పంచుకుంది.అందులో తను మొదట ఒక డ్రెస్ తో కనిపించగా తర్వాత బికినీ టైపులో ఉన్న షార్ట్ డ్రెస్( Short dress ) తో దర్శనం ఇచ్చింది.

దీంతో ఆ వీడియో చూసి చాలామంది ఆమెపై నెగటివ్ కామెంట్లు చేశారు.నువ్వు కూడా అందరిలా తయారయ్యి చెడిపోతున్నావు అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.

దీంతో ఫైర్ అయిన వితికా అందరికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.బట్టల వల్ల అభిప్రాయం మారిపోయే సొసైటీలో ఉన్నాం.చీర కట్టుకొని స్విమ్మింగ్ చేయలేం కదా.స్విమ్మింగ్ కి వెళ్తే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటారు.సిచువేషన్ కి తగ్గట్టు కంఫర్ట్ బట్టి బట్టలు వేసుకోవడంలో తప్పులేదు.సులువుగా తీసుకొని వీటిని జడ్జ్ చేయడం ఆపండి అంటూ సమాధానం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube